E-Paper
Advertisement

కొత్తరెడ్డిపాలెంలో విషాదం.. బిర్యానీ తిని.. 50 మందికి అస్వస్థత!

కొత్తరెడ్డిపాలెంలో విషాదం.. బిర్యానీ తిని.. 50 మందికి అస్వస్థత!
Advertisement

food poisoning: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మే 13వ తేదీన మిగిలిపోయిన బిర్యానీని, మరుసటి రోజు (14వ తేదీన) గ్రామస్తులు తిన్నారు. నిల్వ ఉంచిన ఆ ఆహారం కలుషితం కావడంతో, గురువారం రాత్రి నుంచి ఆ గ్రామ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ ఆహార కాలుష్యం కారణంగా మొత్తం 50 మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితుల్లో ప్రస్తుతం 44 మంది కోలుకోగా, పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉన్న మరో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) విజయలక్ష్మి శుక్రవారం కొత్తరెడ్డిపాలెం గ్రామాన్ని స్వయంగా సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు.

Advertisement

Also Read: కుషాయిగూడలో విషాదం.. ఎయిర్ కూలర్‌లో నీళ్లు పోస్తూ వ్యాపారి మృతి

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×