E-Paper
Advertisement

ప్రధాని మోదీ హత్యకు కుట్ర? CIAతో డీల్? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్

ప్రధాని మోదీ హత్యకు కుట్ర? CIAతో డీల్? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్
Advertisement

PM Narendra Modi Assassination Plot: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశా పరారీ గ్రామంపై అర్థరాత్రి దాడి చేసిన పోలీసులు అమన్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు ప్రధానమంత్రి కార్యాలయం (PMO)కి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో నిందితులు విదేశీ గూఢచారి సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నార‌న్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అమన్ కుమార్ అనే నిందితుడు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)కి సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానమంత్రిపై దాడి చేసేందుకు తనకు 22 రోజుల సమయం కావాలని అలాగే ఇందుకోసం భారీ మొత్తంలో నగదును అందజేయాలని ఆ సందేశంలో కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

Advertisement

అరెస్టయిన వారి ఇళ్లపై దాడులు నిర్వహించిన సమయంలో పోలీసులు ల్యాప్‌టాప్‌లు.. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు తారుమారు కాకుండా కొన్ని గదులను సీల్ చేశారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. నిందితులు జరిపిన కమ్యూనికేషన్లను ధృవీకరించడానికి అలాగే వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ కుట్ర వెనుక ఏవైనా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు అమన్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు విన్న అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అమన్ కుమార్ చాలా సాధారణ వ్యక్తి అని ఎవరితోనూ గొడవలకు వెళ్లేవాడు కాదని వారు చెబుతున్నారు. రాత్రి భోజనం సిద్ధం చేసుకుంటున్న సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు ఎటువంటి కారణం చెప్పకుండా అతడిని తీసుకెళ్లారని అమన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమ గ్రామానికి చెందిన యువకుడు ఇలాంటి భారీ కుట్రలో ఎలా భాగస్వామి అవుతాడని స్థానికులు పోలీసుల వాదనను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు స‌మాచారం.

Advertisement

Read Also: బెంగళూరులో జాంబీ డ్రగ్ కలకలం.. నిలబడ్డ చోటే ఘోరం? అసలు నిజాలు బయటపెట్టిన పోలీసులు

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×