E-Paper
Advertisement

TMC : టీఎంసీ నేతను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు.. ఆ ట్వీట్లే కారణమా?

TMC : టీఎంసీ నేతను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు.. ఆ ట్వీట్లే కారణమా?
Advertisement

TMC : గుజరాత్‌ పోలీసులు తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక నేతను అదుపులోకి తీసుకున్నారు. టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకొని గుజరాత్‌కు తరలించారు. సాకేత్ గోఖలే అరెస్ట్ ను రాజకీయ కక్షసాధింపు చర్యగా టీఎంసీ పేర్కొంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. సాకేత్‌ జైపూర్‌ వెళుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. గతంలో మోర్బీ వంతెన దుర్ఘటనపై చేసిన ట్వీట్ల కారణంగానే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

సాకేత్‌ గోఖలే సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్‌ వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఆ విమానం రాజస్థాన్‌లో ల్యాండ్‌ అవ్వగానే అప్పటికే అక్కడ వేచ్చి ఉన్న గుజరాత్‌ పోలీసులు సాకేత్ ను అదుపులోకి తీసుకొన్నారు. తెల్లవారు జామున రెండు గంటల సమయంలో సాకేత్‌ తల్లికి ఫోన్‌ చేసి తనను అహ్మదాబాద్‌ తీసుకెళుతున్నారని వెల్లడించారు. అనంతరం అతడి ఫోన్‌.. ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

మోర్బీ వంతెన కూలిన ఘటనపై అతడు చేసిన ట్వీట్లను దృష్టిలో పెట్టుకొని అక్రమకేసును బనాయించారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు. మరోవైపు సాకేత్‌ అరెస్టు పై జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో దిగ్‌పాల్‌ సింగ్‌ స్పందించారు. అతడి అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గేఖలే అరెస్ట్ తో బీజేపీ,టీఎంసీ మధ్య మరోసారి వార్ మొదలైంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×