BigTV English

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Goods carrier derails near Mathura in Uttar Pradesh: దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రయాణిస్తున్నారు. గత కొంతకాలంగా రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది కావాలని దాడులు చేస్తుండగా.. మరోవైపు సాంకేతిక లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాత్రి 8 గంటలకు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.


వివరాల ప్రకారం.. యూపీలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో ఓ బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే దాదాపు 20కు పైగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


యూపీలోని బృందావన్ రోడ్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన 20 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ- మథుర మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని నేషనల్ క్యాపిటల్ రీజియన్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ మార్గాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.

Also Read: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

ఇదిలా ఉండగా, ఇటీవల భోపాల్ సమీపంలోని మిస్రోడ్, మండిదీప్ రైల్వే స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే మరో ప్రమాదం జరగడంతో పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి.

Related News

Los Angeles News: అందరూ చూస్తుండగా.. భారతీయుడిని కాల్చి చంపారు.. ఇదిగో వీడియో!

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Big Stories

×