Bihar Politics: బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. నితీష్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. విపక్షాలకు ఎలాంటి తప్పులు దొరక్కుండా జాగ్రత్త పడింది. విపక్షాలు చేసిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది. ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు.
అసలు ఏమి జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. దొంగ ఓట్లపై బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేస్తున్నారు. యాత్ర నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఓ వ్యక్తి. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తిని దుర్బంగా పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడిని మహమ్మద్ రిజ్విగా గుర్తించిన పోలీసులు, అతడు జాలే అసెంబ్లీ నియోజకవర్గంలో భోపురా గ్రామానికి చెందినవాడుగా తేల్చారు. ఈ వ్యవహారంపై దర్భంగా జిల్లా ఎస్పీ నోరు విప్పారు. ఇండియా కూటమి నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ జరిగింది. అందులో ప్రధాని మోదీ, ఆయన తల్లి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీడియోలో రాహుల్ గాంధీ ర్యాలీ వేదికపై నిల్చున్న సమయంలో కొందరు వ్యక్తులు హిందీలో ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అసభ్య పదజాలం వాడారని తెలిపారు. ఈ వ్యవహారంపై బీజేపీతోపాటు జేడీయూ నేతలు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం ఇప్పుడు బీహార్‌లో రాజకీయ వివాదానికి దారి తీసింది.
ALSO READ: భారత్ బిగ్ స్కెచ్.. ట్రంప్‌కు మూడినట్టే?
ఈ వ్యవహారంపై బీజేపీ ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. రాజకీయాలు అడుగుస్థాయికి దిగజారిపోయాయని అన్నారు. ఆ పార్టీ దాని పాత స్వభావాన్ని, సంస్కృతిని తిరిగి తీసుకొచ్చిందన్నారు హోంమంత్రి అమిత్ షా. దేశ రాజకీయాల్లో ఈ తరహా విషం నింపుతోందని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదన్నారు. అన్ని పరిమితులు దాటి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతీ తల్లి-కొడుక్కి జరిగిన అవమానం అని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలను ఎప్పటికీ క్షమించరన్నారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ ఘటనను ఖండించారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన దివంగత తల్లిపై అత్యంత అనుచితమైన భాష ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారంపై భారత యువజన కాంగ్రెస్ మాజీ జాతీయ కార్యదర్శి మొహమ్మద్ నౌషాద్ క్షమాపణలు చెప్పారు. ఇటువంటి చౌకబారు, అగౌరవ ప్రవర్తనను పార్టీ ఎప్పటికీ ఆమోదించదన్నారు. ఈ పనిని ప్రత్యర్థులు లేదా స్వార్థ ప్రయోజనాలున్న వ్యక్తులు చేసి ఉండవచ్చన్నారు.