Modi Government: రైతు నుంచి వినియోగదారుడి వరకు లాభం చేసేందుకు కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వస్త్ర పరిశ్రమను బలపర్చేందుకు మరోసారి మోదీ సర్కార్ ముందడుగు వేసింది. పత్తి దిగుమతులపై ఉన్న పన్నులను పూర్తిగా ఎత్తివేసింది. దీనిని డిసెంబర్ 31, 2025 వరకు మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రైతులు, వినియోగదారులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jio Special Offer: జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ.91కే వాలిడిటీ అన్ని రోజులా!
ఇప్పటి వరకు పత్తిపై ఎంత శాతం పన్ను ఉంది
ఇప్పటివరకు పత్తి దిగుమతులపై 11 శాతం వరకు పన్ను కట్టేవారు. ఇందులో 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్, 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ రద్దు కావడంతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుంది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గడం వలన, భారతీయ వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో పోటీకి మరింతగా సిద్ధమవుతుంది. వినియోగదారులు కూడా తక్కువ ధరల్లో వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం పొందుతారు. ఇది నిజంగా తయారీ రంగానికి ఊరట కలిగించే నిర్ణయమని నిపుణులు అంటున్నారు. గతంలో కూడా కేంద్రం పత్తి దిగుమతి సుంకాలను తాత్కాలికంగా మినహాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గడువును పొడిగిస్తూ మరోసారి పరిశ్రమకు మద్దతు ఇవ్వడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ముందుచూపు చర్యగా చెప్పుకోవాలి.
కేంద్రం తీసుకున్న విధానాలు
ప్రపంచ మార్కెట్లలో పరిస్థితులు ఎలా మారతాయో స్పష్టత లేకపోయినా, భారతీయ వస్త్ర రంగం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది అని భావం. జూలై నెలలో వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు 5.3 శాతం పెరిగి 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి జూలై 2025 వరకు మొత్తం ఎగుమతులు 12.18 బిలియన్ డాలర్లకు చేరడం కేంద్రం తీసుకున్న విధానాలే ఎంత బలమో సూచిస్తోంది. ప్రధాని మోదీ ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించి, దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే దిశగా ఒక్కో నిర్ణయాన్ని తీసుకుంటోంది. రైతు నుంచి ఫ్యాక్టరీ వరకూ, తయారీ దారుల నుంచి వినియోగదారుల వరకూ అందరినీ దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, దేశ ఆర్థిక వృద్ధికి బలమైన పునాది వేయనుంది.