Trump Tariffs: అమెరికా అంటే ప్రపంచానికే పెద్దన్న అని, తాము ఏదైనా చేస్తామని, ఎవరైనా భయపడాల్సిందే అని, గేమ్ నడిపిస్తామని ఇలా చాలా ఊహించుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను చాలా ఊహించుకున్నారు. ఇండియాను గట్టిగా టార్గెట్ చేద్దాం.. భయపడి కాళ్లబేరానికి వస్తుందనుకున్నారు. కానీ ట్రంప్ అనుకున్నదొక్కటి. జరిగింది మరొక్కటి. టారిఫ్ లతో భయపెట్టాలని ట్రంప్ అనుకుంటే.. ఇండియా వేసిన స్కెచ్ తో అమెరికాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది.
50% టారిఫ్‌లు అమెరికాకు రివర్స్ అవుతాయా?
భారత్ పై అమెరికా దారుణంగా 50 శాతం టారిఫ్ లు వేసింది. దీన్ని ఎవరూ ఊహించను కూడా ఊహించలేకపోయారు.. ఎందుకంటే మోడీ, ట్రంప్ వ్యక్తిగత ఫ్రెండ్ షిప్‌తో ఇండియా టారిఫ్ ల నుంచి తప్పించుకుంటుందనుకున్నారు. కానీ ట్రంప్ లెక్కే వేరు కదా.. అప్పటికప్పుడు మైండ్ లో ఏదో ఆలోచన వచ్చింది.. వైట్ హౌజ్ దగ్గర రిపోర్టర్లు పట్టి పట్టి ఇండియాపై టారిఫ్ ల గురించి అడగడం.. వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా ఇండియాపై 25 శాతం సుంకాలు అన్నారు.. ఆ మరుక్షణమే.. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటున్నారు కాబట్టి మరో 25 శాతం ఫైన్ అంటూ నోటికొచ్చినంత వేసేశాడు ట్రంప్. ఇతనికి తోడు మరో పెద్ద మనిషి వైట్ హౌజ్ అడ్వైజర్ పీటర్ నవారో ట్రంప్ తానా అంటే తందానా అంటున్నాడు.
రష్యాతో బిజినెస్ చేస్తున్న దేశాలను వదిలి భారత్ పైనే ప్రతాపం
ఇక్కడే ట్రంప్ అసలు లాజిక్ మిస్ అయ్యారు. ప్రపంచ దేశాల దృష్టిలో వారి క్రెడిబులిటీకే దెబ్బ పడింది. ఎలాగంటే.. రష్యాతో చైనా, ఈయూ దేశాలు కూడా బిజినెస్ చేస్తున్నాయి. వాటిపై లేని టారిఫ్ మన భారత్ పైనే ఎక్కువ వేయడంలో ఆంతర్యం ఎవరికీ అర్థం కాలేదు. అందరూ అదే క్వశ్చన్ చేశారు కూడా. కానీ ట్రంప్ ఎవరి మాటా వినడు కదా. రైట్.. అయితే ట్రంప్ భారత్ పై వేసిన ఈ సుంకాల ఎఫెక్ట్ ను ఎలా తప్పించుకోవాలో భారత్ బహుముఖ వ్యూహాలను రెడీ చేసింది. అమలు చేస్తోంది కూడా. ఈ దెబ్బకు అమెరికాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అవుతోంది. అమెరికా టారిఫ్‌లు సహజంగానే అక్కడికి దిగుమతి వస్తువుల ధరలను పెంచుతాయి. దీంతో అమెరికన్ కస్టమర్స్.. టెక్స్‌టైల్స్, ఆభరణాలు, సీఫుడ్ వంటి ఉత్పత్తుల కోసం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. 2024-25లో ఇండియా మొత్తం ఎగుమతులు 820 బిలియన్ డాలర్లు. అందులో అమెరికాకు ఎగుమతి వాటా 86.5 బిలియన్లు. ప్రస్తుతానికి మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అదనపు సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. టారిఫ్‌ల వల్ల అమెరికా సప్లై చైన్‌లు గందరగోళంలో పడ్డాయి. కంపెనీలు ధరలను పెంచడం లేదా సప్లై చైన్‌లను రీస్ట్రక్చర్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ఖర్చులను మరింత పెంచుతుంది.
GST సంస్కరణలు ప్రకటించిన ప్రధాని మోడీ
రైట్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ లను ఎదుర్కొనేందుకు భారత్ ఫాలో అవుతున్న బహుముఖ వ్యూహాలేంటో చూద్దాం. పంద్రాగస్టు రోజున ప్రధాని మోటీ GST సంస్కరణలను ప్రకటించారు. 4 లెవెల్స్ లో ఉన్న జీఎస్టీని 5, 18 శాతంగా మార్చబోతున్నారు. ఇది దేశీయ డిమాండ్‌ను పెంచుతుందంటున్నారు. ఈ పరిణామం చిన్న వ్యాపారాలకు ఈజీ అవుతాయి. టారిఫ్‌ల వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేస్తాయంటున్నారు. అలాగే కేంద్రం కూడా టెక్స్‌టైల్స్, కెమికల్స్ రంగాలకు సపోర్ట్ ఇవ్వడం ప్రాధాన్యంగా చూస్తున్నారు. టారిఫ్‌లతో ఎక్కువగా ప్రభావితమయ్యే MSMEలకు తక్కువ వడ్డీ రుణాలు, GST రిలీఫ్‌ల ద్వారా సపోర్ట్ ఇస్తారు. అటు చైనాతోనూ ఆర్థిక సంబంధాలను పునరుద్ధరణ జరుగుతోంది. ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆగస్టు 18 న భారత్ లో పర్యటించారు. అటు ప్రధాని మోడీ కూడా 31న చైనా వెళ్లబోతున్నారు. అటు RBI మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా, UAE వంటి దేశాలతో రూపాయి ఆధారిత వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తోంది. ఇది విదేశీ మారక హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ట్రంప్ ఎంత హెచ్చరించినా… రష్యా నుంచి చమురు కొనుగోలు కంటిన్యూ చేస్తామని భారత్ ప్రకటించింది.
టెక్స్ టైల్స్ రంగంలో 20 లక్షల మంది ఉపాధి
ఇప్పటికే 50 శాతం అమెరికా టారిఫ్ లు అమలులోకి వచ్చేశాయి. ఇందులో కీలకమైన రంగం టెక్స్ టైల్స్. ఎందుకంటే మన దగ్గర 20 లక్షల ఉద్యోగ కల్పనకు సంబంధించింది ఈ రంగం. అందుకే కేంద్రం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. ఇండియా టెక్స్‌టైల్ ఎగుమతులలో 35% అమెరికాకే వెళ్తాయి. 50 శాతం టారిఫ్ లు అమల్లోకి రావడంతో అమెరికన్ మార్కెట్లలో మన ఉత్పత్తుల రేట్లు పెరిగి గిరాకీ ఉండదు. తక్కువ ధరలు ఉండే దేశాల ఉత్పత్తులనే అమెరికన్ జనాలు కొనే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ 40 దేశాలతో వాణిజ్యం మరింత పెంచుకునే ప్లాన్ చేస్తోంది. యూకే, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, UAE, ఆస్ట్రేలియా సహా 40 దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ 40 దేశాలు కలిసి 590 బిలియన్ డాలర్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం భారత్ వాటా కేవలం 5-6% మాత్రమే.
ట్రెడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, మార్కెట్లపై స్టడీ
ఈ 40 దేశాల్లో మన వస్త్ర ఉత్పత్తుల్ని రాత్రికి రాత్రి అమ్మడం కష్టమే. అందుకే ఇప్పటి నుంచే ఆయా దేశాలతో చర్చలు జరపడం, ట్రేడ్ ఫెయిర్స్ లో పాల్గొనడం, అక్కడి వ్యాపారులతో చర్చలు జరపడం, మన బ్రాండింగ్ ను పెంచుకోవడం ద్వారా వారిని ఆకర్షించాలనుకుంటున్నారు. భారత్ అనుకుంటున్న ఆ 40 దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ ను గుర్తించి ఎక్స్ పోర్ట్ చేసేలా ప్లాన్లు నడుస్తున్నాయి. ప్రొడక్షన్ క్లస్టర్‌లతో డైరెక్ట్ లింకప్ చేసే విధానాన్నీ ఆలోచిస్తున్నారు. భారత్ లోని టెక్స్‌టైల్ రంగం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకు ప్రధాని మోడీ సూచించిన 5F ఫార్ములాను అమలులోకి తీసుకొస్తున్నారు. ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్ ప్లాన్ పై స్పీడ్ పెంచుతున్నారు. PM MITRA పార్క్‌లు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ వంటి పథకాలతో టెక్స్‌టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు.
భారత్ జీడీపీకి వచ్చిన ఢోకా ఏమీ లేదన్న సంస్థలు
ఇక అమెరికన్ టారిఫ్ లతో భారత్ జీడీపీ తగ్గుతుందా పెరుగుతుందా అన్న చర్చ కూడా అంతర్జాతీయంగా జరుగుతోంది. అయితే చాలా వరకు రేటింగ్ సంస్థలు భారత్ జీడీపీకి వచ్చిన ఢోకా ఏమీ లేదంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ ఆధారితమైంది కావడం వల్ల ప్రభావం పరిమితమే అని S&P గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అటు లోకల్ గా రేట్లను తగ్గించడం వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా అమలు చేస్తున్న GST సంస్కరణలు అమెరికా సుంకాల ప్రభావాన్ని ఆపగలుగుతాయని ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ BMI తాజాగా తన అంచనా తెలిపింది. ఈ దశాబ్దంలో భారత్… ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండే అవకాశం ఉందంటోంది. BMI నోట్ ప్రకారం US సుంకాలు కొన్ని పరిశ్రమలను ప్రభావితం చేసినప్పటికీ, ఇండియా GDP 6 శాతానికి మించి ఉంటుందని అంచనా వేసింది. ఇది చాలు కదా.. ట్రంప్ మనల్ని ఏమీ చేయలేడు అనడానికి నిదర్శనం.
అమెరికా అంటే ప్రపంచానికే పెద్దన్న అని, తాము ఏదైనా చేస్తామని, ఎవరైనా భయపడాల్సిందే అని, గేమ్ నడిపిస్తామని ఇలా చాలా ఊహించుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను చాలా ఊహించుకున్నారు. ఇండియాను గట్టిగా టార్గెట్ చేద్దాం.. భయపడి కాళ్లబేరానికి వస్తుందనుకున్నారు. కానీ ట్రంప్ అనుకున్నదొక్కటి. జరిగింది మరొక్కటి. టారిఫ్ లతో భయపెట్టాలని ట్రంప్ అనుకుంటే.. ఇండియా వేసిన స్కెచ్ తో అమెరికాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది.
ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాలు ఊస్టింగ్
ఎందుకంటే మోడీ, ట్రంప్ వ్యక్తిగత ఫ్రెండ్ షిప్ తో ఇండియా టారిఫ్ ల నుంచి తప్పించుకుంటుందనుకున్నారు. కానీ ట్రంప్ లెక్కే వేరు కదా.. అప్పటికప్పుడు మైండ్ లో ఏదో ఆలోచన వచ్చింది.. వైట్ హౌజ్ దగ్గర రిపోర్టర్లు పట్టి పట్టి ఇండియాపై టారిఫ్ ల గురించి అడగడం.. వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా ఇండియాపై 25 శాతం సుంకాలు అన్నారు.. ఆ మరుక్షణమే.. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటున్నారు కాబట్టి మరో 25 శాతం ఫైన్ అంటూ నోటికొచ్చినంత వేసేశాడు ట్రంప్. ఇతనికి తోడు మరో పెద్ద మనిషి వైట్ హౌజ్ అడ్వైజర్ పీటర్ నవారో ట్రంప్ తానా అంటే తందానా అంటున్నాడు. ఇక్కడే ట్రంప్ అసలు లాజిక్ మిస్ అయ్యారు. ప్రపంచ దేశాల దృష్టిలో వారి క్రెడిబులిటీకే దెబ్బ పడింది. ఎలాగంటే.. రష్యాతో చైనా, ఈయూ దేశాలు కూడా బిజినెస్ చేస్తున్నాయి. వాటిపై లేని టారిఫ్ మన భారత్ పైనే ఎక్కువ వేయడంలో ఆంతర్యం ఎవరికీ అర్థం కాలేదు. అందరూ అదే క్వశ్చన్ చేశారు కూడా. కానీ ట్రంప్ ఎవరి మాటా వినడు కదా. రైట్.. అయితే ట్రంప్ భారత్ పై వేసిన ఈ సుంకాల ఎఫెక్ట్ ను ఎలా తప్పించుకోవాలో భారత్ బహుముఖ వ్యూహాలను రెడీ చేసింది. అమలు చేస్తోంది కూడా. ఈ దెబ్బకు అమెరికాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అవుతోంది.
ఇండియా మొత్తం ఎగుమతులు 820 బిలియన్ డాలర్లు
అమెరికా టారిఫ్‌లు సహజంగానే అక్కడికి దిగుమతి వస్తువుల ధరలను పెంచుతాయి. దీంతో అమెరికన్ కస్టమర్స్.. టెక్స్‌టైల్స్, ఆభరణాలు, సీఫుడ్ వంటి ఉత్పత్తుల కోసం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. 2024-25లో ఇండియా మొత్తం ఎగుమతులు 820 బిలియన్ డాలర్లు. అందులో అమెరికాకు ఎగుమతి వాటా 86.5 బిలియన్లు. ప్రస్తుతానికి మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అదనపు సుంకాల నుంచి అమెరికా మినహాయించింది. టారిఫ్‌ల వల్ల అమెరికా సప్లై చైన్‌లు గందరగోళంలో పడ్డాయి. కంపెనీలు ధరలను పెంచడం లేదా సప్లై చైన్‌లను రీస్ట్రక్చర్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ఖర్చులను మరింత పెంచుతుంది. రైట్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ లను ఎదుర్కొనేందుకు భారత్ ఫాలో అవుతున్న బహుముఖ వ్యూహాలేంటో చూద్దాం. పంద్రాగస్టు రోజున ప్రధాని మోటీ GST సంస్కరణలను ప్రకటించారు. 4 లెవెల్స్ లో ఉన్న జీఎస్టీని 5, 18 శాతంగా మార్చబోతున్నారు. ఇది దేశీయ డిమాండ్‌ను పెంచుతుందంటున్నారు. ఈ పరిణామం చిన్న వ్యాపారాలకు ఈజీ అవుతాయి. టారిఫ్‌ల వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేస్తాయంటున్నారు. అలాగే కేంద్రం కూడా టెక్స్‌టైల్స్, కెమికల్స్ రంగాలకు సపోర్ట్ ఇవ్వడం ప్రాధాన్యంగా చూస్తున్నారు. టారిఫ్‌లతో ఎక్కువగా ప్రభావితమయ్యే MSMEలకు తక్కువ వడ్డీ రుణాలు, GST రిలీఫ్‌ల ద్వారా సపోర్ట్ ఇస్తారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ ఆగస్టు 18న భారత్‌లో పర్యటింనున్నారు.
అటు చైనాతోనూ ఆర్థిక సంబంధాలను పునరుద్ధరణ జరుగుతోంది. ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆగస్టు 18 న భారత్ లో పర్యటించారు. అటు ప్రధాని మోడీ కూడా 31న చైనా వెళ్లబోతున్నారు. అటు RBI మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా, UAE వంటి దేశాలతో రూపాయి ఆధారిత వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తోంది. ఇది విదేశీ మారక హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ట్రంప్ ఎంత హెచ్చరించినా.. రష్యా నుంచి చమురు కొనుగోలు కంటిన్యూ చేస్తామని భారత్ ప్రకటించింది. ఇప్పటికే 50 శాతం అమెరికా టారిఫ్ లు అమలులోకి వచ్చేశాయి. ఇందులో కీలకమైన రంగం టెక్స్ టైల్స్. ఎందుకంటే మన దగ్గర 20 లక్షల ఉద్యోగ కల్పనకు సంబంధించింది ఈ రంగం. అందుకే కేంద్రం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. ఇండియా టెక్స్‌టైల్ ఎగుమతులలో 35% అమెరికాకే వెళ్తాయి. 50 శాతం టారిఫ్ లు అమల్లోకి రావడంతో అమెరికన్ మార్కెట్లలో మన ఉత్పత్తుల రేట్లు పెరిగి గిరాకీ ఉండదు. తక్కువ ధరలు ఉండే దేశాల ఉత్పత్తులనే అమెరికన్ జనాలు కొనే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ 40 దేశాలతో వాణిజ్యం మరింత పెంచుకునే ప్లాన్ చేస్తోంది. యూకే, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, UAE, ఆస్ట్రేలియా సహా 40 దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ 40 దేశాలు కలిసి 590 బిలియన్ డాలర్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం భారత్ వాటా కేవలం 5-6% మాత్రమే.
40 దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్‌ను గుర్తించి ఎక్స్ పోర్ట్ చేసేలా భారత ప్లాన్
ఈ 40 దేశాల్లో మన వస్త్ర ఉత్పత్తుల్ని రాత్రికి రాత్రి అమ్మడం కష్టమే. అందుకే ఇప్పటి నుంచే ఆయా దేశాలతో చర్చలు జరపడం, ట్రేడ్ ఫెయిర్స్ లో పాల్గొనడం, అక్కడి వ్యాపారులతో చర్చలు జరపడం, మన బ్రాండింగ్ ను పెంచుకోవడం ద్వారా వారిని ఆకర్షించాలనుకుంటున్నారు. భారత్ అనుకుంటున్న ఆ 40 దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ ను గుర్తించి ఎక్స్ పోర్ట్ చేసేలా ప్లాన్లు నడుస్తున్నాయి. ప్రొడక్షన్ క్లస్టర్‌లతో డైరెక్ట్ లింకప్ చేసే విధానాన్నీ ఆలోచిస్తున్నారు. భారత్ లోని టెక్స్‌టైల్ రంగం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకు ప్రధాని మోడీ సూచించిన 5F ఫార్ములాను అమలులోకి తీసుకొస్తున్నారు. ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్ ప్లాన్ పై స్పీడ్ పెంచుతున్నారు. PM MITRA పార్క్‌లు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ వంటి పథకాలతో టెక్స్‌టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు.
Also Read: ఏపీకి గూడ్‌న్యూస్.. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్
ఇక అమెరికన్ టారిఫ్ లతో భారత్ జీడీపీ తగ్గుతుందా పెరుగుతుందా అన్న చర్చ కూడా అంతర్జాతీయంగా జరుగుతోంది. అయితే చాలా వరకు రేటింగ్ సంస్థలు భారత్ జీడీపీకి వచ్చిన ఢోకా ఏమీ లేదంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ ఆధారితమైంది కావడం వల్ల ప్రభావం పరిమితమే అని S&P గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అటు లోకల్ గా రేట్లను తగ్గించడం వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా అమలు చేస్తున్న GST సంస్కరణలు అమెరికా సుంకాల ప్రభావాన్ని ఆపగలుగుతాయని ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ BMI తాజాగా తన అంచనా తెలిపింది. ఈ దశాబ్దంలో భారత్… ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండే అవకాశం ఉందంటోంది. BMI నోట్ ప్రకారం US సుంకాలు కొన్ని పరిశ్రమలను ప్రభావితం చేసినప్పటికీ, ఇండియా GDP 6 శాతానికి మించి ఉంటుందని అంచనా వేసింది. ఇది చాలు కదా.. ట్రంప్ మనల్ని ఏమీ చేయలేడు అనడానికి నిదర్శనం.
Story By Vidya Sagar, Bigtv