India vs Bangladesh 1st Test Day 1 To Be Washed Out Due To Rain: చాలా రోజుల తర్వాత టీమిండియా మళ్లీ.. గ్రౌండ్లో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 19 అంటే ఇవాల్టి నుంచి.. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య.. టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టులు అలాగే మూడు టి20 మ్యాచ్లలో భాగంగా.. ఇండియాకు వచ్చింది బంగ్లాదేశ్. అయితే ఇవాల్టి నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాల్టి నుంచి 23వ తేదీ వరకు… టెస్ట్ మ్యాచ్ కొనసాగానే ఉంది.
ఇక ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ చెన్నై లోని ఎంఏ చిదంబరం.. స్టేడియంలో జరగనుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు.. ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సందర్భంగా వాతావరణం కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది.అయితే రేపు వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ మొదటి రోజు మాత్రం ఆటకు వర్షం అడ్డంకి లేదని చెబుతున్నారు నిపుణులు.
9 గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ముగిసిన తర్వాత మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. స్పిన్ కు అనుకూలించే విధంగా… చెన్నై స్టేడియం ని రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జియో సినిమా యాప్ లేదా స్పోర్ట్స్ 18 లో మనం వీక్షించవచ్చు. ఇక బంగ్లాదేశ్ లో ఉన్నవారు బంగ్లాదేశ్ టీవీలో.. ఈ మ్యాచ్ తిలకించవచ్చు.
Also Read: IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్ అతడే..రోహిత్, పాండ్యా ఔట్?
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే… కీలక మార్పులతో టీమిండియా… జట్టు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది టీమిండియా. రవీంద్ర జడేజా, అశ్విన్ అలాగే కుల్దీప్ యాదవులు ముగ్గురు ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. అటు రిషబ్ పంత్… చాలా రోజుల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తొలి టెస్ట్ ఆడుతున్నాడు పంత్. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అలాగే రోహిత్ శర్మ బరిలో ఉండే ఛాన్స్ ఉంది. గిల్ మాత్రం ఫస్ట్ టౌన్ లో వస్తాడు. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ జట్టును ఆదుకోవాల్సి ఉంటుంది.
జట్ల అంచనా
India: రోహిత్ శర్మ (c), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, KL రాహుల్, రిషబ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్/మహమ్మద్ సిరాజ్
Bangladesh: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (c), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (WK), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా