Nindu Manasulu : బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ ద్వారా ఎంతోమంది నటీనటులు బాగా ఫేమస్ అవుతున్నారు. సీరియల్స్ లో తన తమ క్యారెక్టర్లతో ప్రేక్షకులు మనసుకు దగ్గరవడంతో ఆ సీరియల్ చూసి సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఇప్పటికీ పలు సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ రీసెంట్ గా వచ్చిన సరే సూపర్ హిట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నిండు మనసులు ఒకటి.. ఇటీవలే ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ప్రేరణ కు ఇది రెండో సీరియల్. ఈ మధ్యనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా బాగానే అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె అసలు పేరు ఏమిటి? ఎన్ని వేల రెమ్యూనరేషన్ ఒక్క రోజుకి తీసుకుంటుందో తెలుసుకుందాం..
‘నిండు మనసులు’ ప్రేరణ రెమ్యూనరేషన్..
నిండు మనసులు సీరియల్ స్టార్ మాలో సాయంత్రం 6: 30 ప్రసారం అవుతుంది. ఇటీవలే సీరియల్ ప్రారంభం అయ్యింది. కానీ అతి కొద్ది రోజుల్లోనే బాగా ఫేమస్ అయింది. దీన్ని స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సీరియల్ లో ప్రేరణ పాత్రలో నటించింది పవిత్ర నాయక్. గతంలో ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్‌లో హీరోయిన్ పద్దు పాత్రలో పవిత్ర యాక్టింగ్ ఇరగదీసింది. హీరోయిన్ తండ్రిగా ఇంద్రనాథ్, ఆయన మొదటి భార్యగా సంగీత యాక్ట్ చేస్తున్నారు.. పవిత్ర ఈ సీరియల్ కు ఒక్క రోజుకు 35 వేలు చార్జ్ చేస్తుందని టాక్. ఈ లెక్కన ఈమె 25 రోజుల షూటింగ్ ఉంటుంది. అంటే లక్షలు అందుకుంటుంది. ఇప్పుడు మరో సీరియల్ కూడా చేస్తుందని సమాచారం.
Also Read: బాడీ షేమింగ్ వల్ల బాధపడ్డా.. నరకం చూశాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న హరిత స్టోరీ..
పవిత్ర రియల్ లైఫ్ విషయానికొస్తే..
పవిత్ర బి నాయక్ ఒక నటి, “నువ్వు నేను ప్రేమ” వంటి సీరియల్స్‌లో నటించారు. ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లలో ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె కన్నడ, తమిళం, ఆంగ్లంలో నిష్ణాతురాలు, తెలుగు కూడా కొద్దిగా మాట్లాడగలదు.. ఆమె మాతృభాష తమిళం, ఆమె కన్నడ, ఆంగ్లంలో కూడా నిష్ణాతురాలు. ఆమె 1997 సెప్టెంబర్ 13వ తేదీ శనివారం కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. పాఠశాల విద్య తర్వాత, ఆమె బెంగళూరులోని శ్రీ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్ చేసింది.. అలా సీరియల్స్ లలో నటించే అవకాశాన్ని పొందింది.. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ళ మనసుల్లో పద్దుగా చెరగని ముద్ర వేసుకుంది. కొత్త సీరియల్ చేస్తున్న సరే అందరూ పద్మావతిగానే గుర్తుపెట్టుకున్నారు. ఇకముందు ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.. ఈమధ్య తెలుగు వాళ్ల కన్నా వేరే భాషల్లో నుంచి వచ్చిన హీరోయిన్ బాగా ఫెమస్ అవుతున్నారు.