OTT Movie : ఓటీటీలో సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అద్భుతమైన సెట్ డిజైన్స్, కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక సిరీస్ ఆసక్తికరంగా ఉంటోంది. 10,000 సంవత్సరాల ముందు జరిగే ఈ కథను చూస్తున్నకొద్దీ చూడాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మానవజాతి భవిష్యత్తు కోసం చేసే పోరాటాలతో ఈ సిరీస్ మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సిరీస్ లో నటి టబు కూడా నటించి మెప్పించింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకివెళ్తే …
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘డూన్: ప్రాఫెసీ’ (Dune: Prophecy) 2024లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్. దీనిని డయాన్ అడెము-జాన్, ఆలిసన్ షాప్కర్ సృష్టించారు. ఈ సిరీస్ 2024 నవంబర్ 17న ప్రీమియర్ అయి, డిసెంబర్ 2024లో రెండవ సీజన్‌కు రిన్యూ అయింది. ఇందులో ఎమిలీ వాట్సన్ (వల్యా హార్కోనెన్), ఒలివియా విలియమ్స్ (తులా హార్కోనెన్), ట్రావిస్ ఫిమ్మెల్ (డెస్మండ్ హార్ట్), జోడీ మే (ఎంప్రెస్ నటాల్యా), మార్క్ స్ట్రాంగ్ (ఎంపరర్ జావిక్కో కొరినో) నటించారు. HBO Maxలో ఆరు ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
10,000 సంవత్సరాల ముందు మానవజాతి కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ స్టోరీ జరుగుతుంది. వల్యా హార్కోనెన్ అనే సిస్టర్‌హుడ్ తన సోదరి తులాతో కలిసి బెనె గెస్సెరిట్‌ను స్థాపించడానికి, ఇంపీరియం రాజకీయాలలో ప్రభావం చూపడానికి కష్టపడుతుంటుంది. వారి లక్ష్యం ఒక సిస్టర్‌ను ఇంపీరియల్ థ్రోన్‌పై కూర్చోబెట్టడం, మానవజాతి భవిష్యత్తును రక్షించడం. ఇంతలో డెస్మండ్ హార్ట్ అనే ఒక సైనికుడు, అరాకిస్‌లో విచిత్రమైన శక్తులతో వస్తాడు. సిస్టర్‌హుడ్‌కు సవాలుగా మారతాడు. అతను వల్యా, తులా వంశానికి చెందినవాడు. హార్కోనెన్-అట్రీడెస్ సంతతికి చెందినవాడని తెలుస్తుంది. ఇది రాజకీయ, వ్యక్తిగత గొడవలను తీవ్రతరం చేస్తుంది. ఎంప్రెస్ నటాల్యా, ఎంపరర్ జావిక్కో లతో రాజకీయ ఆటలు, అరాకిస్‌లో స్పైస్ పై ఆధిపత్య పోరాటం కథను ఆసక్తికరంగా చేస్తాయి.
డెస్మండ్ హార్ట్ శక్తులు, సిస్టర్‌హుడ్ స్పైస్ అగోనీ రిచువల్స్ కథలో మిస్టికల్ టెన్షన్‌ను పుట్టిస్తాయి. వల్యా, తులా మధ్య గొడవలు, తులా గత తప్పిదం కుటుంబ డ్రామాను తీవ్రతరం చేస్తాయి. సిస్టర్ ఫ్రాన్సెస్కా, ఎంపరర్ ట్రూత్‌సేయర్, రాజకీయ ఆటలలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కీరన్ అట్రీడెస్, యువరాణి యినెజ్ హార్కోనెన్-అట్రీడెస్ శత్రుత్వాన్ని పెంచుతారు. సీజన్ చివరలో వల్యా డెస్మండ్‌తో ఫైట్ చేసి సిస్టర్‌హుడ్‌ను, మానవజాతిని రక్షించడానికి పోరాడుతుంది. ఇక క్లైమాక్స్ రెండో సీజన్ కి ఎంట్రీ ఇస్తుంది.
Read Also : రాయల్ ఫ్యామిలీ అని మాయ చేసే కేటుగాడు… నిజాం రింగ్ చుట్టూ తిరిగే స్టోరీ… తెలుగులోనే స్ట్రీమింగ్