Illu Illalu Pillalu Today Episode August 30 th : నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్, నర్మదలు ఇద్దరు కూడా బైకుపై సరదాగా వెళ్తుంటారు.. అయితే సాగర్ బండి నడపడం చూసి నర్మదా నాకేంటి టార్చర్ అని అంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా వస్తున్నాం కదా… నాకు చాలా సంతోషంగా ఉంది అని సాగర్ అంటాడు. ఎప్పుడూ నాన్న నాన్న అంటావ్ కదా అందుకే ఇన్నాళ్లకు మనం ఇలా రావాల్సి వచ్చింది అని అంటుంది నర్మదా.. ఇద్దరూ కలిసి సరదాగా బయట ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. నర్మదా సాగర్ చేస్తున్న చిత్ర విచిత్రాలకి ఈరోజు సునామీ తుఫాను అన్ని వచ్చేలా ఉన్నాయని అంటుంది.. నువ్వే మీ నాన్నకు భయపడి ఇంట్లోంచి బయటికి తీసుకురావాలన్నా కూడా పర్మిషన్ ఇవ్వడం అనుకుంటావు. సాగర్ అన్నమాటకు నర్మదా ఫీలవుతుంది. అంతలోకే నర్మదకు ఎక్కిళ్లు రావడంతో ఎవరో తలుచుకుంటున్నారని సాగర్ అంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ వస్తుంది. హార్ట్ ఏటాక్ వచ్చిందని తెలుసుకొని షాక్ అవుతుంది… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి ప్రేమ కు వచ్చిన లెటర్ ఏంటో తెలుసుకోవాలని అక్కడికి వెళుతుంది.. ప్రేమ ఉంటే ఆ పని చేయడం కుదరదు అని అత్తయ్య నిన్ను పిలుస్తుంది ప్రేమ వెళ్ళు అని చెప్తుంది. ప్రేమ అలా వెళ్ళగానే శ్రీవల్లి ప్రేమ గదిలో అన్నీ వెతుకుతుంది. ఆ లెటర్ ఎక్కడ పెట్టిందో అని వెతుకుతూ ఉంటుంది అంతలో ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్లి ఏంటత్తా పిలిచావంటే అని అడుగుతుంది.. అయ్యో శ్రీరామ నేనెందుకు పిలిచాను నిన్ను అని వేదవతి అంటుంది.
వల్లి ఎందుకు పిలిచింది అని ఆలోచించుకుంటూ గదిలోకి వస్తుంది.. బల్లి నువ్వు ఎందుకు నన్ను పిలిచావు అత్త ఎక్కడ పిలిచింది అసలు అని అరుస్తుంది. ఏమో అత్తయ్య పిలిచింది ఏమో అనుకొని చెప్పాను. ఇప్పుడు ఏమైంది అని వల్లి అడుగుతుంది. అయినా నువ్వు మా గదులు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీ గదిలోకి రావద్దా ఏంటి ఇంకెప్పుడు రానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. చిటికెలో తప్పించేసుకుంది ప్రేమ అని వల్లి బాధపడుతూ ఉంటుంది.
సాగర్ నర్మదను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి పెడతాడు. నర్మద ఏడవడం చూసి సాగర్ బాధపడతాడు. మీ నాన్నకు మాట ఇచ్చిన ప్రకారం నేను జాబ్ తెచ్చుకుంటాను ఇప్పుడు మీ నాన్న ఆరోగ్యం బాగానే ఉంది కదా నువ్వేం భయపడకు అని అంటాడు. నర్మదా బయట నిల్చుని ఏడవడంతో వేదవతి రామరాజు ఏమైందని అడుగుతారు. వాళ్ళ నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందన్న విషయం తెలుసుకొని షాక్ అవుతారు. ఇక వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఏమైందో కనుక్కుంటారు. నర్మదకు వేదవతి ధైర్యం చెబుతుంది.
ముందుగా అనుకున్నట్లుగానే ఆ సేటు డబ్బులు కోసం చందు పరువు తీసేస్తాడు. చందు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉండిపోతాడు. కాలర్ పట్టుకుని నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అని అక్కడున్న వాళ్ళందరూ చూస్తుండగానే చందు ని అడుగుతాడు. చందు మాత్రం నేను మీ డబ్బులు ఇస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని ఎంత బ్రతిమలాడినా సరే ఆ సేటు ఆగడు. చివరికి రెండు లక్షల చొప్పున మొత్తం డబ్బులు తీర్చేస్తానని చందు అనడంతో ఆ సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక చందు ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే బాధపడతాడు అని ఆలోచిస్తూ వస్తాడు. వెనకాల లారీ వస్తున్న సరే చూసుకోకుండా అలానే రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. అప్పుడే ధీరజ్ చందు ని పక్కకు లాగి కాపాడుతాడు. ఏంట్రా పెద్దోడా ఏం ఆలోచిస్తున్నావ్ నీకేం కష్టం వచ్చింది రా అని అడుగుతాడు కానీ చందు ఏం చెప్పడు.
Also Read : ప్రభావతి పై మీనా సీరియస్.. బుద్ధి చూపించిన మనోజ్.. ఇంట్లో బాంబ్ పేల్చబోతున్న బాలు..
సాగర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. సాగర్ వచ్చి ఏమైందిరా యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నామని వాడు చెప్పగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది అని అంటాడు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి రా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చందు అంటాడు. కానీ ధీరజ్ నేను ఎలాగోలా అరెంజ్ చేస్తాను అని అంటాడు. తన ఫ్రెండ్స్ అందర్నీ అడుగుతాడు కానీ ఎవరు కూడా డబ్బులు లేవనే చెప్తారు. చందు ఇంటికి వచ్చి శ్రీవల్లితో ఈ విషయాన్ని చెప్తాడు.. నా పరువు మొత్తం పోయింది ఇప్పుడు జాబ్ పోతుంది రేపు నా ప్రాణమే పోతుంది అని అంటాడు.. శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని తన తల్లితో ఎలాగైనా చెప్పాలని అనుకుంటుంది. ఇక భాగ్యం సీన్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..