Tensor G5 Chip Fail| గూగుల్ ఇటీవల పిక్సెల్ 10 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని పిక్సెల్ 10 ప్రో XL ఫోన్‌లో టెన్సర్ G5 చిప్ తొ రన్ అవుతుంది. ఈ ఫోన్ పనితీరును రెడ్డిట్ యూజర్ ఒకరు టెస్ట్ చేశారు. AnTuTu బెంచ్‌మార్క్ యాప్‌తో ఈ ఫోన్ స్కోరు 1,173,221 వచ్చింది. ఈ స్కోర్ హానర్ 200 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్‌ల స్కోరుతో సమానంగా ఉంది.
CPU పనితీరు
టెన్సర్ G5 చిప్‌లో సిపియు స్కోరు 415,848. ఇది స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4, డైమెన్సిటీ 9300+ చిప్‌లతో సమానంగా ఉంది. గత పిక్సెల్ 9 ప్రో XL కంటే ఇది 15% మెరుగైన పనితీరును చూపిస్తుంది. అయితే, 2024 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లతో పోలిస్తే ఇది 2023 ప్రాసెసర్‌ల స్థాయిలోనే ఉంది.
GPU పనితీరు
టెన్సర్ G5లో ఉన్న PowerVR IMG DXT-48-1536 GPU స్కోరు 367,206. ఇది పిక్సెల్ 9 ప్రో XL (440,000) కంటే 20% తక్కువ. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1, నాలుగేళ్ల పాత చిప్‌తో సమానంగా ఉంది. గేమింగ్, గ్రాఫిక్స్‌లో ఈ GPU పనితీరు నిరాశపరిచింది.
పూర్తి స్థాయి పనితీరు
పిక్సెల్ ఫోన్‌ల పర్‌ఫామెన్స్ సాధారణంగా మిగతా ప్రీమియం ఫ్లాగ్ షిప్‌ల కంటే కాస్త వెనుకబడి ఉంది. కానీ తాజాగా ప్రవేశపెట్టిన టెన్సర్ చిప్‌లు AI ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెడతాయి. రోజువారీ వినియోగంలో CPU పనితీరు బాగుంది. అయితే గేమింగ్ లాంటి పెద్ద యాప్‌లలో కొంత స్లోగా పనిచేస్తాయి. గూగుల్.. రా పవర్ కంటే సమర్థతపై ఎక్కువ దృష్టి పెడుతుంది.
డిస్‌ప్లే, డిజైన్
పిక్సెల్ 10 ప్రో XLలో 6.8-అంగుళాల LTPO డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1,344×2,992 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో రక్షణ ఉంది. ఈ డిస్‌ప్లే అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది.
కెమెరా
ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 48MP టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 42MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌లో అద్భుతమైన నాణ్యతను అందిస్తాయి. పిక్సెల్ ఫోన్‌ల కెమెరాలు ఎల్లప్పుడూ బలమైన అంశం.
బ్యాటరీ, ఛార్జింగ్
5,200mAh బ్యాటరీతో, ఈ ఫోన్ రోజంతా ఉపయోగించే హెవీ యూజర్లకు సరిపోతుంది. 45W వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరిత ఛార్జింగ్ ఫీచర్ బ్యాటరీని వేగంగా రీఛార్జ్ చేస్తుంది.
ధర, లభ్యత
భారతదేశంలో 256GB వేరియంట్ ధర ₹1,24,999. మూన్‌స్టోన్, ఒబ్సిడియన్, జాడే రంగుల్లో లభిస్తుంది.
పిక్సెల్ 10 ప్రో XLలోని టెన్సర్ G5 చిప్, పిక్సెల్ 9 ప్రో కంటే కొంచెం మెరుగైన CPU పనితీరును అందిస్తుంది. కానీ GPU పనితీరు స్నాప్‌డ్రాగన్ జెన్ 2 చిప్‌లతో పోలిస్తే నెమ్మదిగా ఉంది. డిస్‌ప్లే, కెమెరాలు ఈ ఫోన్ బలాలు. AI ఫీచర్లపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఫోన్ మంచి ఎంపిక, కానీ గేమింగ్‌లో ఆసక్తి ఉన్నవారికి ఇది నిరాశపరుస్తుంది.
Also Read: ఏఐతో పోటీపడే చిచ్చరపిడుగులు.. తెలివైన పిల్లలు పుట్టేందుకు గర్భంలోనే ఇంజినీరింగ్