Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం తీవ్రతరం చేశారు. అక్కడి రాజకీయ పార్టీలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను ప్రచార క్షేత్రాలుగా మారుస్తున్నాయి. దీనికితోడు ఏఐ టెక్నాలజీని విస్తారంగా వినియోగిస్తున్నారు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ వినియోగం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తన ఎన్నికల ప్రచారంలో హోలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, తన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి టెక్నాలజీని ఆయుధంగా చేసుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం సాధ్యం కాలేదు. దీంతో హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ ద్వారా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల విజయ్ వేదికపై ఉన్నట్లుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కుంభకోణం ప్రాంతంలోని జరిగిన ఎన్నికల ప్రచారంలో హోలోగ్రామ్ వీడియో చూసిన ఓటర్లు తమ అభిమాన నటుడు వచ్చినట్టు ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేశారు.
టీవీకే పార్టీ అభ్యర్థుల వినూత్న ప్రచారం.. ఓటర్లు ఫుల్‌ఖుషీ
వీడియోల రూపంలో కాకుండా ఏఐ సహాయంతో రూపొందించిన హోలోగ్రామ్ విజువల్స్ ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అభ్యర్థుల తరపున ప్రచారం చేసేటప్పుడు ఆయా ప్రాంతాల సమస్యలను ఏఐ ద్వారా విజయ్ మాట్లాడినట్టుగా ఓటర్లకు ఆకట్టుకునే అనుభూతిని కలిగిస్తున్నారు. అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్ లేని లోటు తీరుస్తున్నాయి.
అంతేకాదు యువ ఓటర్లను ఆకర్షించడంలో టెక్ ప్రచారం కీలకంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుంభకోణం వీడియో టీవీకే పార్టీ శ్రేణుల్లోనే ఓటర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రచార ఖర్చు తగ్గడమే కాకుండా ఎక్కువ మందిని చేరుకోవడానికి వీలవుతుందని అంటున్నారు ఆ పార్టీ అభ్యర్థులు.
ALSO READ: విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!
దీనివల్ల సవాళ్లు లేకపోలేదు. డీప్ ఫేక్స్ వంటి వాటితో తప్పుడు ప్రచారాలు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థులు ఓటర్లకు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలని ఆ పార్టీ టెక్ విభాగం నుంచి సంకేతాలు వెళ్లాయి. విజయ్ అనుసరిస్తున్న డిజిటల్ వ్యూహం రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ అన్ని నియోజకవర్గాలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో, అభ్యర్థులు ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ వాడుతున్నారు. దీని ద్వారా విజయ్ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్లే కనిపిస్తూ ఓటర్లతో మాట్లాడుతున్నారు.… pic.twitter.com/9LlbCm4ZZQ
— ChotaNews App (@ChotaNewsApp) April 13, 2026