E-Paper
Advertisement

Mysore: మైహర్‌లో అనుమానిత తట్టు కలకలం…ఇద్దరు చిన్నారులు మృతి

Mysore: మైహర్‌లో అనుమానిత తట్టు కలకలం…ఇద్దరు చిన్నారులు మృతి
Advertisement

Suspected Measles in Mysore: మధ్యప్రదేశ్‌లోని మైహర్‌లో చిన్నారులను వింత వ్యాధి వెంటాడుతుంది. వైద్య అధికారులు దీనిని తట్టు(measles)గా అనుమానిస్తున్నారు. ఈ వ్యాధితో ఇప్పటికే ఇద్దరు పిల్లలు మరణించారు. కాగా మరో 17 మంది చిన్నారులు వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లా అధికారులు ఎనిమిది గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేసినట్లుగా తెలిపారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా వైద్య బృందాన్ని నియమించి, తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 14, 16 తేదీల్లో ఇద్దరు పిల్లలు అనుమానాస్పద తట్టుతో మరణించారు. ఎనిమిది గ్రామాల్లోని మరో 17 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించాము.” అని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎంహైచ్‌ఓ) ఎల్‌కే తివారీ తెలిపారు.

Advertisement

వ్యాధి ప్రభావితం ఉన్నటువంటి ఎనిమిది గ్రామాల్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని నివాసాలను సర్వే చేయాలని కోరినట్లు అధికారి తెలిపారు. బయట పిల్లలు గుమికూడటాన్ని కూడా ఆ జిల్లా కలెక్టర్ నిషేధించినట్లు సమాచారం.

వ్యాధి సోకినవారి నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఏఐఐఎంఎస్‌)కు పంపామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు చెందిన వైద్యబృందం ప్రభావిత గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని ఒక అధికారి వెల్లడించారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×