BigTV English
Advertisement

Flight Accident In Serbia: టేకాఫ్‌ క్రమంలో ప్రమాదం.. గంటసేపు గాల్లోనే ఉన్న విమానం..

Flight Accident In Serbia: టేకాఫ్‌ క్రమంలో ప్రమాదం.. గంటసేపు గాల్లోనే ఉన్న విమానం..
Flight Accident In Serbia

Flight Accident In Serbia (news paper today):


టేకాఫ్‌ క్రమంలో రన్‌వే సమీపంలో ఉన్న పరికరాలను ఢీకొన్న ఘటనలో ఓ విమానం ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ క్రమంలో రన్‌వే సమీపంలో ఉన్న పరికరాలను ఢీకొనడంతో ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్లైట్ గాల్లోకి దూసుకెళ్లి గంట తర్వాత అదే ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగింది. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Belgrade Airport)లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎయిర్‌ సెర్బియాకు చెందిన విమానం.. 106 మంది ప్రయాణికులతో బెల్‌గ్రేడ్‌లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు టేకాఫ్‌ తీసుకుంది. అయితే.. తగినంత ఎత్తుకు చేరుకోకపోవడంతో రన్‌వే చివర్లో ఉన్న ‘ల్యాండింగ్‌ సిస్టమ్‌ అరే’ పరికరాలను ఢీకొంది. ఈ ఘటనలో ఎడమవైపు రెక్క భాగం తీవ్రంగా ధ్వంసమైంది. రంధ్రం పడటంతో పాటు విమానం బాడీ (ఫ్యూజ్‌లేజ్‌) చీరుకుపోయినట్లు కనిపిస్తోన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. తోక భాగం కూడా దెబ్బతింది.


ఫ్లైట్‌ తిరిగి వచ్చిన అనంతరం.. ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. దానికి ముందు దాదాపు గంటసేపు గాల్లో ఉన్న సమయంలో విమానం కంపించిందని ప్రయాణికులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. ఈ పరిణామంతో బెల్‌గ్రేడ్‌ ఎయిర్‌పోర్టును కొద్దిసేపు మూసివేశారు.

Tags

Related News

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం

Netherlands Next Prime Minister: నెదర్లాండ్ కు తొలి ‘గే’ ప్రధానమంత్రి.. ఎవరీ రాబ్ జెట్టెన్?

Supermarket Explosion: సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది స్పాట్‌డెడ్

Kenya Landslide: విరిగిపడిన కొండ చరియలు.. 21 మంది మృతి

Big Stories

×