E-Paper
Advertisement

Greater Noida : భారీ వర్షానికి కూలిన పై కప్పు.. ముగ్గురు చిన్నారులు మృతి

Greater Noida : భారీ వర్షానికి కూలిన పై కప్పు.. ముగ్గురు చిన్నారులు మృతి
Advertisement

Builing Roof Collapsed in Greater Noida : నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలడంతో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఖోడ్నా కలాన్ గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పిల్లలు నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుకుంటుండగా.. దాని పై కప్పు కూలిపోయినట్లు గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ సునీతి అధికారిక ప్రకటనలో తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భవనం పై కప్పు శుక్రవారం సాయంత్రం కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి గోడ పునాది నానిపోయి బలహీనంగా మారడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

స్థానిక నివాసి అయిన సఘీర్ నిర్మించుకుంటున్న ఇంటి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూలిన పై కప్పు శిథిలాల కింద 8 మంది చిక్కుకున్నారని, వారిలో ముగ్గురు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. మిగిలిన ఐదుగురు చిన్నారులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనపై విచారణ జరుపుతున్నామని గౌతమ్ బుద్ధనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అతుల్ కుమార్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు.

 

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×