E-Paper
Advertisement

Kalki 2898 Ad Box Office Collection Day 2: ఘోరంగా పడిపోయిన ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ డే కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

Kalki 2898 Ad Box Office Collection Day 2: ఘోరంగా పడిపోయిన ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ డే కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!
Advertisement

Kalki 2898 Ad Box Office Collection Day 2 : ‘కల్కి 2898 ఏడీ’.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు.. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ మూవీ బీజీఎం, క్లిప్స్, ప్రభాస్ డైలాగ్‌లే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసును షేక్ చేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో ప్రభాస్ కనిపించిన మొట్ట మొదటి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఫుల్ సర్‌ప్రైజ్ అయ్యారు. అంతేకాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించి అందరినీ ఆశ్చర్చపరిచాడు.

విజువల్స్, విఎఫ్‌వర్క్స్, కంటెంట్, క్రియేటివిటీతో యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు, అభిమానుల్ని ఫిదా చేశాడు. నిజంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇలాంటి ఒక విజువల్ వండర్ ప్రపంచాన్ని సృష్టిస్తాడని ఎవరూ అనుకోరు. అందులోనూ వివిధ భాషలకు సంబంధించిన స్టార్లకు ఈ సినిమాలో కీలక పాత్రలు క్రియేట్ చేసి వారిని చూపించే విధానం అందరినీ అట్రాక్ట్ చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనే, దిశాపటానీ, రానాతో సహా మరింత మంది స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించి అదరగొట్టేశారు.

Advertisement

ఈ సినిమా చూస్తే అచ్చం హాలీవుడ్ రేంజ్ మార్వెల్స్ మూవీలా అనిపించిందనే కామెంట్లు వినిపించాయి. అలాంటి ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్లను నమోదు చేసింది. మొదటి షో తోనే బిగ్గెస్ట్ పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.191.5 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడవ స్థానం సంపాదించుకుంది.

Also Read: బాక్సాఫీసు రారాజు.. ప్రభాస్ రాజు.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

Advertisement

అందులో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ రూ.223 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అలాగే బాహుబలి 2 రూ.217 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు మూడో స్థానంలో కల్కి 2898 ఏడీ మూవీ రూ.191.5 కోట్లతో ఉంది. ఇక మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు మరింత అదరగొడుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి.

కల్కి మూవీ రెండు రోజు కలెక్షన్లతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని భావించిన ఫ్యాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలిరోజు ఇండియాలో రూ.95.3 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి వచ్చే సరికి డీలా పడిపోయింది. రెండో రోజు దారుణమైన కలెక్షన్లు నమోదు చేసింది. ఇండియాలో రెండో రోజు నెట్ వసూళ్లు కేవలం రూ. 50 కోట్లు వరకు మాత్రమే వచ్చాయి. దీంతో అంతా షాకవుతున్నారు. ఇందులో తెలుగు నుంచి రూ.24.65 కోట్లు, హిందీలో రూ.20.5 కోట్లు, తమిళంలో రూ.3.5 కోట్లు, మలయాళంలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.298.5 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని తాజాగా మూవీ మేకర్స్ వెల్లడించారు. అయితే ఇప్పుడెలాగూ వీకెండ్ కాబట్టి శనివారం, ఆదివారాల్లో కలెక్షన్స్ ఊపందుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ రెండు రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు వస్తాయో..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×