Union Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్ – 2026 పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. తద్వారా వరుసగా 9వ సారి ఈ ఘనత సాధించిన తొలి ఆర్థికమంత్రిగా ఆమె నిలిచారు. అంతేకాదు స్వాతంత్ర భారతావనిలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగానూ ఆమె రికార్డు సృష్టించారు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అందులోని అంశాలు, కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈసారి ఆసక్తికరంగా నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై రాజకీయంగా చర్చ మెుదలైంది. కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పార్లమెంటులో బడ్జెట్ – 2026 ప్రవేశపెట్టేందుకు ఆమె తమిళనాడులోని మెజెంటా రుంగు కట్టం కాజీవరం (కాంచీపురం) చీరను ధరించి వచ్చారు. బంగారు రంగు అంచు కలిగిన గోధుమ కలర్ శారీ, ఎరుగు రంగు బ్లౌజ్, శాలువా కప్పుకొని ఆమె బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ కాంచీపురం చీరను ధరించడం ద్వారా.. భారతీయ హస్తకళా సంప్రదాయాన్ని పార్లమెంటు వేదికగా చాటిచెప్పే ప్రయత్నం చేశారు.
తమిళనాడులోని కాంచీపురంకు చెందిన చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సాధించాయి. కాంచీపురం పట్టు చీరలకు శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. 9-13వ శతాబ్ద కాలంలో చోళ రాజులు కళలను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఇందులో భాగంగా కంచికి చెందిన చేనేత కార్మికులకు చోళులు వెన్ను, దన్నుగా నిలిచినట్లు చరిత్ర చెబుతోంది. స్వచ్ఛమైన పట్టుతో బంగారు – వెండి కోటింగ్ తోనూ చీరలను తయారు చేయడం కాంచీపురం చేనేత కార్మికుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.
2026 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కాంచీపురం చీరనే నిర్మలాసీతారామన్ కట్టడం వెనుక రాజకీయ పరమైన కారణం సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలతో దీనిని ముడిపెడుతున్నారు. కొద్ది నెలల్లో కేరళ, బెంగాల్, పుదుచ్చేరి, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిన పొలిటికల్ గా తమిళనాడు ఎంతో కీలకంగా కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్షించేందుకే ఆర్థిక మంత్రి కాంచీపురం చీరను ధరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: Union Budget-2026 live Updates: కేంద్రమంతి నిర్మల బడ్జెట్-2026 ప్రసంగం, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్
బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్ చీరపై చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి (2019) నుంచి ఆమె చీరలపై చర్చ జరుగుతూనే వస్తోంది. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర, 2020లో నీలం రంగులో అంచు కలిగిన పసుపుపచ్చ – బంగారు వర్ణం చీర, 2021లో ఎరుపు-గోధుమ రంగు కలిగిన పోచంపల్లి చీర, 2022లో ఒడిశాకు చెందిన చేనేత చీర, 2023లో టెంపుల్ బోర్డర్ లో ఎరుపు రంగు చీర, గతేడాది బంగారు మోటిఫ్ లతో ఉన్న మెజెంటా బోర్డర్ చీరను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Also Read: Union Budget-2026 live Updates: కేంద్రమంతి నిర్మల బడ్జెట్-2026 ప్రసంగం, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్