BigTV English

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా విజేతలకిచ్చే ట్రోఫీని మాత్రం తీసుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(PCB) చైర్మన్ కమ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి రావడమే దీనికి ప్రధాన కారణం. ఆయన ఇచ్చే ట్రోఫీని తీసుకోవడం ఇష్టం లేక టీమ్ ఇండియా అలా చేసింది. ఈ ప్రవర్తనతో టీమ్ ఇండియా భారతీయుల హృదయాలను గెలుచుకుందని అంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ఇచ్చే ట్రోఫీని తిరస్కరించిన భారత్ ఆటగాళ్లు పాకిస్తాన్ కి గట్టి గుణపాటం చెప్పారని సోషల్ మీడియా పొగడ్తల్లో ముంచెత్తింది.


కారణం అదేనా?
సోషల్ మీడియాలో భారత్ ఆటగాళ్లపై పొగడ్తలు వినిపిస్తున్నట్టే విమర్శలు కూడా చుట్టుముడుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ తేలు మీదుగా కప్ తీసుకోవడం ఇష్టం లేని భారత్ ఆటగాళ్లు మరి పాకిస్తాన్ తో క్రికెట్ ఎందుకు ఆడారు? ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ తో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్నట్టేనని ప్రభుత్వం స్పష్టం చేసిన వేళ, ఆసియా కప్ లో ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆడారు సరే, మరి ఓపెనింగ్ సెరిమొనీ రోజు భారత్ చేసిన హడావిడి ఎందుకని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఆపరేషన్ బీజేపీ..
భారత ఆటగాళ్లతో సహా టీమ్ ఇండియా కంట్రోల్ మొత్తం బీసీసీఐ చేతుల్లోనే ఉంటుంది. బీసీసీఐ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం ఏం చెబితే, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఆమోదించడం బీసీసీఐ సహా ఇతర క్రీడా సంస్థల విధి. సో.. ప్రభుత్వ అంగీకారంతోనే ఇక్కడ భారత జట్టు ఆసియా కప్ లో పాల్గొంది. టోర్నమెంట్ ప్రారంభంలో పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయాల్సి వచ్చింది. అక్కడితో ఆగలేదు. వారితో కలసి తినడం, కలసి నడవడం, ఫొటోషూట్ లో పాల్గొనడం కూడా తప్పనిసరిగా మారింది. చివరకు ట్రోఫీని పరిచయం చేసే కార్యక్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పోటీలో పాల్గొంటున్న జట్ల కెప్టెన్లందరితో కరచాలనం చేశారు. అందులో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఆ వ్యవహారం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.


తీవ్ర విమర్శలు..
ఆసియా కప్ టోర్నీలో భారత్ పాల్గొనడం చాలామంది క్రికెట్ అభిమానులకు ఇష్టం లేదు. పైగా ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్తాన్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన మొహ్సిన్ నఖ్వీ చైర్మన్ గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీకి భారత జట్టు ఎందుకు హాజరైందని చాలామంది ప్రశ్నించారు. పాక్ తో యుద్ధం జరిగి 6 నెలలు కూడా పూర్తి కాకుండానే ఆ దేశంతో క్రికెట్ ఆడటం సరికాదని చాలామంది భారతీయ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తమ సందేశాలను ఉంచారు. దీంతో ప్రభుత్వం ఇరుకున పడింది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.

బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే?
చివరిగా ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే ట్రోఫీని తిరస్కరించినట్టు సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి. ఓపెనింగ్ సెరిమనీ టైమ్ లో ఉన్న జోష్, విజేతగా నిలిచిన తర్వాత ఎందుకు తగ్గిపోయిందో చెప్పాలని కొంతమంది నిలదీస్తున్నారు. ఇక ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియాను విష్ చేస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ లో కూడా ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన ఉంది. దీంతో ఇది తప్పకుండా బీజేపీ స్క్రిప్ట్ అని సోషల్ మీడియా హోరెత్తిపోయింది. కేవలం దీన్ని రాజకీయ విమర్శగా చూడలేం, రాజకీయ ప్రత్యర్థులే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అనుకోలేం. మొత్తానికి ఆసియా కప్ ఆడటం వల్ల వచ్చిన వ్యతిరేకతను విజేతగా నిలిచి కప్ ని తిరస్కరించి కాస్త తగ్గించారని చెప్పుకోవాలి. బీజేపీ రాజకీయ క్రీడలో ఆటగాళ్లు నలిగిపోతున్నారనేది విశ్లేషకుల వాదన.

Related News

TVK Vijay: తొక్కిసలాటలో 41 మంది మృతి.. స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Big Stories

×