BigTV English

OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

OG 2 Shooting: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా సుజిత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా(OG Movie) ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ అందుకుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో చిత్ర బృంద సీక్వెల్ గురించి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సీక్వెల్ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులలో ఎన్నో అంచనాలు సందేహాలు కూడా వ్యక్తమౌతూ వచ్చాయి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సినిమా కథ నేపథ్యం ఏంటి? అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.


నాని సినిమా తరువాతే ఓజీ పార్ట్ 2

ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ముందుగానే ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సుజిత్ నాని(Nani)తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. నాని హీరోగా బ్లడీ రోమియో (Bloody Romeo )అనే సినిమాని చేయబోతున్నారు అయితే ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని పూజా కార్యక్రమాలను జరుపుకొనుంది. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని వచ్చేయడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు పక్కా ప్రణాళికలను రచించారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఓజి2 (OG 2)షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తుంది. ఇలా 2026 ఏప్రిల్ లేదా మే నెల నుంచి ఓజీ 2 షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.

వచ్చే ఏడాదే OG 2 షూటింగ్..

ఇక ఈ సినిమాని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఓజీ సినిమా ప్రీక్వెల్ పనులను కూడా ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమా వెంట వెంటనే షూటింగ్ పనులను ప్రారంభించబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఓజి2 పనులు మరింత ఆలస్యం అవుతాయని అభిమానులు భావించారు.


ఓజీ సినిమా చూసిన మెగా కుటుంబం..

ఇలా సినిమా ఆలస్యమవుతుందని అనుకున్న అభిమానులకు వచ్చే ఏడాది నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందనే విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో ఘనంగా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా చిత్ర బృందంతో కలిసి మెగా కుటుంబ సభ్యులు ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్ లో వీక్షించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఓజీ సినిమాను సుజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సీక్వెల్ లో అకిరా లేదా ప్రభాస్ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

Related News

Chiranjeevi: మెగా 158 లో ప్రభాస్ హీరోయిన్.. బాబీ ఎంపిక సరైనదేనా?

Mass Jathara: మాస్ మహారాజ్ తో రచ్చ చేసిన హైపర్ ఆది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

OG success Meet : స్టార్ హోటల్ లో ఓజి సక్సెస్ ఈవెంట్, 12 ఏళ్ల తర్వాత ఆ మూమెంట్ 

Actor Darshan: దర్శన్‌కు మొత్తటి పరుపు ఇవ్వండి… కోర్టులో విచారణ

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

Tollywood : ఇండస్ట్రీ బాగు కోసం… టాలీవుడ్ పిల్లర్ బాలకృష్ణ ఎక్కడా ?

Big Stories

×