E-Paper
Advertisement

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు
Advertisement

Wife Kills Husband No Punishment| భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ ప్రాణాంతకంగా మారింది. కోపంలో భార్య కత్తితో పొడవడంతో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసి కేవలం రూ.500 జరిమానా మాత్రమే విధించింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? హైకోర్టు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది?

భార్యాభర్తల మధ్య గొడవ ఎలా మొదలైంది?

కేసు వివరాల ప్రకారం.. భార్యాభర్తలు నెల రోజులుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. ఒకరోజు భర్త.. పిల్లలకు ఖర్జూరాలు ఇవ్వడానికి భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.
అక్కడ భార్యను చూసిన తర్వాత అతను ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను దూషించినట్లు ఆమె తెలిపింది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే తిరిగి వచ్చి మళ్లీ అసభ్యంగా మాట్లాడినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహానికి గురైన భార్య కత్తితో భర్త మెడపై పొడిచింది. తీవ్ర గాయంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

Advertisement

అరుపులు విన్న పొరుగింటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. భర్త నేలపై గాయాలతో పడి ఉండటాన్ని చూసి అతని తల్లికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జైలు శిక్ష విధించిన ట్రయల్ కోర్టు

పోలీసులు తొలుత భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302తో పాటు సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 సెప్టెంబర్ 8న ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు భార్యను దోషిగా నిర్ధారించింది. అయితే, కోర్టు భార్యభర్తల మధ్య గొడవ, పిల్లల బాధ్యతలు, పరిస్థితులను పరగణించి.. ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ II కింద 4 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.500 జరిమానా విధించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును ఆమె హై కోర్టులో సవాలు చేసింది.

జైలు శిక్ష రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

Advertisement

హైకోర్టు సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, కత్తి స్వాధీనం వంటి ఆధారాలను పరిశీలించింది. భర్తను కత్తితో పొడిచిన ఘటనను నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
అయితే, ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో జరగలేదని, అకస్మాత్తుగా జరిగిన గొడవలో ఆవేశంతో ఆమె ఈ చర్యకు పాల్పడిందని కోర్టు పరిగణించింది.
దీంతో ఆమెపై ఉన్న నేర నిర్ధారణను కొనసాగిస్తూ, నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. కేవలం రూ.500 జరిమానాతో సరిపెట్టింది. జరిమానా చెల్లించకపోతే నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

Also Read: వృద్ధ తల్లిదండ్రులను వదిలి భర్తను ఇంటల్లుడిగా ఉండాలన్న యువతి.. విడాకుల కేసులో కోర్టు తీర్పు ఇదే

ఈ కేసులో చట్టపరమైన మినహాయింపులు ఎందుకు?

ఐపీసీ సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ (మినహాయింపు) 4 ప్రకారం.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మిక గొడవలో ఆవేశంతో జరిగిన కొన్ని నేరాలు హత్య పరిధిలోకి రాకపోవచ్చు. అయితే, నిందితుడు అన్యాయమైన ప్రయోజనం పొందకూడదు లేదా క్రూరంగా వ్యవహరించకూడదు. ఈ మినహాయింపు నేర బాధ్యతను పూర్తిగా తొలగించదు. అలాగే ప్రతి కేసులోనూ జరిమానాతో సరిపెట్టాలని చట్టం చెప్పదు.

Also Read: భర్త కౌగిలించుకోగానే విరిగిన భార్య పక్కటెముకలు.. అతని తప్పులేదన్న డాక్టర్లు

హైకోర్టు అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించి, నేర నిర్ధారణను కొనసాగించింది. కేవలం శిక్షను మాత్రమే మార్చింది. అందువల్ల ఈ తీర్పును.. నిర్దోషిగా విడుదల చేసిన కేసుగా పరిగణించకూడదని లీగల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ, పలువురికి గాయాలు

అప్పులు తీర్చి, గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగేందుకు.. కిడ్నాప్ డ్రామా ఆడిన నీట్‌ స్టూడెంట్!

గుట్కా ఉమ్ముతూ విద్యుత్ వైర్లపై.. బాల్కనీలో అసలు ఏం జరిగింది? మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు

6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

Big Stories

Advertisement
×