E-Paper
Advertisement

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ
Advertisement

Malayalam Crime Comedy OTT : కాలేజీ అంటే చదువులు, స్నేహాలు, సరదా. కానీ అదే కాలేజీలోకి ఓ ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్‌ మోటివేషన్‌ స్పీకర్‌ వేషంలో ప్రవేశిస్తే… విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా కనిపించే అతడి వెనుక ఉద్దేశం వేరేగా ఉంటే… అతడి రాకతో అప్పటికే కఠినమైన నిబంధనల మధ్య నడుస్తున్న కాలేజీలో గందరగోళం మొదలైతే ? ఇలాంటి అనూహ్య పరిణామాలతో సాగే మలయాళ చిత్రం ‘అడినాశం వెల్లప్పొక్కం’ (Adinaasam Vellapokkam). మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోంది ? ఓటీటీలో తెలుగులో ఉందా లేదా ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం.

కథలోకి వెళ్తే…

లిబర్టీ ఇంజినీరింగ్‌ కాలేజీలో కఠినమైన నిబంధనల మధ్య విద్యార్థుల జీవితం సాగుతుంటుంది. కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తుంటాడు. ఇలాంటి వాతావరణంలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థుల జీవితాల్లోకి ఓ గ్యాంగ్‌స్టర్‌ ప్రవేశిస్తాడు. కొలంబస్‌ అనే పేరుతో గుర్తింపు పొందిన ఆ వ్యక్తి సాధారణ నేరస్థుడిలా కాలేజీలోకి రావడం లేదు. విద్యార్థులకు జీవిత పాఠాలు చెప్పే మోటివేషన్‌ స్పీకర్‌ గా మారువేషంలో అడుగు పెడతాడు.

Advertisement

విద్యార్థులతో స్నేహంగా మాట్లాడుతూ, వారికి సలహాలు ఇస్తూ, కాలేజీ వాతావరణంలో కలిసి పోయేందుకు ప్రయత్నిస్తాడు. చూస్తే అతడి మాటల్లో స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ అతడు అక్కడికి ఎందుకు వచ్చాడు ? విద్యార్థులతో సన్నిహితంగా మెలగడం వెనుక ఏదైనా ప్రణాళిక ఉందా ? అనే సందేహాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. మరోవైపు ప్రిన్సిపాల్‌ కఠినమైన పర్యవేక్షణ కారణంగా విద్యార్థులు చేసే ప్రతి పని సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

గ్యాంగ్‌స్టర్‌ రాకతో కాలేజీలో సాధారణంగా జరిగే సంఘటనలు కూడా అనూహ్యమైన మలుపులు తీసుకుంటాయి. నేర ప్రపంచానికి చెందిన వ్యక్తి విద్యాసంస్థలోకి అడుగు పెట్టడం వల్ల ఏర్పడే పరిణామాలను హాస్యంతో కలిపి చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది. మరి విద్యార్థులు అతడిని నిజంగానే స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా భావిస్తారా ? లేక అతడి అసలు స్వరూపం బయట పడుతుందా ? అతడి ప్రణాళిక కాలేజీని ఎలాంటి గందరగోళంలోకి నెడుతుంది ? అనేవే కథలోని ఆసక్తికర అంశాలు.

Advertisement

Also Read : ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

‘అడినాశం వెల్లప్పొక్కం’ అక్టోబర్‌ 16 నుంచి సైనా ప్లే (Saina Play)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇది మలయాళ చిత్రం. ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko), వినీత్‌ మోహన్‌ (Vineeth Mohan), సంజయ్‌ థామస్‌ (Sanjay Thomas), మంజు పిళ్లై (Manju Pillai), బైజు సంతోష్‌ (Baiju Santhosh), బాబు ఆంటోనీ (Babu Antony), జాన్‌ విజయ్‌ (John Vijay) తదితరులు నటించారు. దర్శకుడిగా, రచయితగా ఏ.జె. వర్గీస్‌ (AJ Varghese) వ్యవహరించారు. కాలేజీ నేపథ్యం, అక్కడ జరిగే నేరం వంటి అంశాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఓ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

Tags

Related News

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

ప్రేమ, పగ మధ్య నలిగిపోయే గ్యాంగ్‌స్టర్‌… వెన్నులో వణుకు పుట్టించే ఊచకోత… తెలుగులో తమిళ యాక్షన్ డ్రామా

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×