Daaku Maharaj OTT:నందమూరి అభిమానులకి చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ అందించిన మూవీ డాకు మహారాజ్(Daku Maharaj) అని చెప్పుకోవచ్చు. అయితే అనిల్ రావిపూడి(Anil ravipudi)డైరెక్షన్లో బాలకృష్ణ(Balakrishna) భగవంత్ కేసరి (Bhagavanth kesari) సినిమాతో వచ్చినప్పటికీ ఈ సినిమాలో అంతగా మాస్ ఎలివేషన్స్ లేకపోవడంతో బాలయ్య అభిమానులు నిరాశ పడ్డారు. కానీ బాబి కొల్లి(Bobby kolli) డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ మాస్ యాక్షన్స్ సన్నివేషాలతో బాలకృష్ణ(Balakrishna) ని అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాతోనే ఆడియన్స్ ముందుకు వచ్చి డాకు మహారాజ్ మూవీతో హిట్టు కొట్టారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వారు సంయుక్తంగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలకృష్ణ హీరోగా చేసిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), ఊర్వశి రౌటేలా (Urvashi Rautela), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath)లు హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా కనిపించారు. వీరితోపాటు చాందిని చౌదరి (Chandni Chowdary) కూడా కీలకపాత్ర పోషించింది.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డాకు మహారాజ్ మూవీ(Daaku Maharaj Movie) ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) చెప్పి మరీ హిట్టు కొట్టడంతో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే అలాంటి డాకు మహారాజ్ సినిమాని థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీ లో చూడడానికి రెడీగా ఉన్నారు.ఇక ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని చాలామంది ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. తాజాగా డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేశారు.మరి ఇంతకీ ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ (Balakrishna) డాకు మహారాజ్ మూవీని భారీ ధరకు కొనుగోలు చేశారు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం. ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 21 నుండి ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు.. నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా బయట పెట్టడంతో బాలయ్య అభిమానులు సంతోషపడుతున్నారు.
అఖండ 2 కోసం వెయిటింగ్..
ఇక థియేటర్లో బాలకృష్ణ మాస్ పర్ఫామెన్స్ ని చూడకుండా మిస్ అయిన అభిమానులకు మరొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్ని అంచనాలతో వచ్చిన డాకు మహారాజ్ మూవీ రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ -2(Akhanda-2) మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే అఖండ-2 మూవీకి సంబంధించి షూటింగ్ ని స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్.బోయపాటి శ్రీను (Boyapati Sreenu) డైరెక్షన్లో వచ్చిన ‘అఖండ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ -2 ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కుంభమేళా స్టార్ట్ అయిన సమయంలో షూట్ స్టార్ట్ చేశారు. మరి చూడాలి అఖండ -2 తో కూడా బాలకృష్ణ (Balakrishna) హిట్ కొట్టి తన నట విశ్వరూపం చూపించి వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.
Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju!
Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ
— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025