BigTV English

BIG TV Exclusive : ‘నో వాటర్ బాటిల్స్’… SSMB 29 సెట్స్‌లో 2 కోట్లు సేవ్ చేస్తున్న జక్కన్న

BIG TV Exclusive : ‘నో వాటర్ బాటిల్స్’… SSMB 29 సెట్స్‌లో 2 కోట్లు సేవ్ చేస్తున్న జక్కన్న

BIG TV Exclusive : తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన ఎస్ ఎస్ రాజమౌళి ఓ సినిమా చేసే టైంలో ఎంత కఠినంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. స్ట్రిక్ట్ రూల్స్ పెడుతూ ఉంటాడు. వాటిని ఆ సినిమాలో నటించి అగ్ర తారాగణం కూడా పాటించాల్సిందే. ఇప్పుడు రాబోతున్న SSMB 29 కూడా జక్కన్న స్ట్రిక్ రూల్స్ పెట్టాడట. దీంతో మేకర్స్‌కు దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు సేవ్ చేస్తున్నాడట. దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాటిస్తున్నారట.


అయితే, జక్కన్న పెట్టిన రూల్స్ ఏంటి..?
మహేష్ బాబు కూడా ఫాలో అవుతున్నాడా..?
దీని వల్ల జక్కన్న ఏం మెసేజ్ ఇస్తున్నాడు…?
అనేవి ఇప్పుడు చూద్దాం…

మోస్ట్ అవైయిటెడ్ మూవీ SSMB 29. ఈ మూవీ రీసెంట్‌గా పట్టాలెక్కింది. మొన్నటి వరకు ప్రియాంక చోప్రా, మహేష్ బాబుపై పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు గండిపేట్‌లో భారీ సెట్స్ వేశారు. ఇప్పుడు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ సెట్స్‌లో ఎస్ ఎస్ రాజమౌళి కఠిన నిబంధనలు పెడుతున్నాడట.


నో వాటర్ బాటిల్స్…

రాజమౌళి సినిమా అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం కామన్. అది హీరోలకు కూడా వర్తిస్తాయి. అయితే ఈ SSMB29 మూవీకి కూడా జక్కన్న స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు. సినిమా సెట్స్‌లో ప్లాస్టిక్ పై పూర్తిగా బ్యాన్ వేశాడట. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కడా కనిపించడానికి వీలులేదు అని తమ టీంకి ఆదేశించాడట. ఎవరైన వాటర్ తాగలంటే… అక్కడ ఓ గాజు బాటిల్ పెట్టారట. దీనితోనే వాటర్ తాగాలని చెప్పారట. ఈ గాజు వాటర్ బాటిల్ వాడకం అనేది సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాటించాల్సిందేనని జక్కన్న చెప్పడట. అలాగే ఈ మూవీలో జాయిన్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా అదే పాటించాలి. అంతే కాదు… ఈ సినిమా కోసం రాబోయే హాలీవుడ్ నటీనటులు కూడా జక్కన్న పెట్టిన ఈ ‘నో ప్లాస్టిక్ బాటిల్స్’ రూల్‌ను ఫాలో కావాల్సిందే.

నిర్మాతలకు 2 కోట్లు సేవ్..?

SSMB 29 మూవీని దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో మూడు పార్టులుగా రాబోతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దుబారా ఖర్చులు లేకుండా… సినిమా మరింత క్వాలిటీగా తీయడానికే మాత్రమే డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో షూటింగ్ సెట్స్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ నిషేధించడంతో కొత్త వరకు ఖర్చు తగ్గించినట్టే. అలాగే ప్లాస్టిక్ కి దూరంగా ఉండాలని ఓ మేసెజ్ కూడా ఇస్తున్నాడు.

SSMB 29 కోసం ప్రతి రోజు దాదాపు 2000 మంది పని చేస్తున్నారు. వారి అందరికీ ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉన్న వాటర్ ను కొనుక్కు రావడం అంటే.. చాలా ఖర్చుతో కూడిన పని. జక్కన్న తీసుకున్నఈ నిర్ణయం ప్రతి రోజు ఈ 2000 మందికి కావాల్సిన ప్లాస్టిక్ బాటిల్స్ రావడం లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ తాగిన తర్వాత  క్రాష్ చేయడం లేదు. దీంతో అక్కడ  కొంత వరకు అయినా… ప్లాస్టిక్ ను నిర్మూలించగలిగారు.

మొత్తం ఆవిడ వల్లే..

SSMB 29 సెట్స్‌లో ఈ మార్పు… ఈ క్రమశిక్షణ గల కారణం వల్లీ అని తెలుస్తుంది. వల్లి ఎవరో కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి భార్య. అలాగే రమా రాజమౌళికి అక్కనే. ఆవిడ ఆవిడ కనుసైగల్లోనే ఇదంతా సిస్టమేటిక్‌గా జరుగుతుంది.

అందరూ నేర్చుకోవాల్సిందే…

నిజానికి ప్లాస్టిక్ ను నిషేధించడానికి ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, అది వీలు అవ్వడం లేదు. కానీ, ఇప్పుడు షూటింగ్ సెట్స్ లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను బ్యాన్ చేసి అందరికీ ఓ ఇన్స్పిరేషన్ అయ్యాడు జక్కన్న. ఇక నుంచి డైరెక్టర్లు అందరూ కూడా తమ సినిమా షూటింగ్ సెట్స్‌లో ఇలా ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తే బాగుంటుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గడంతో పాటు… నటీనటుల ఆరోగ్యం పాడవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు అవుతుంది.

మహేష్ మాత్రం ఇలా…

రాజమౌళి చెప్పడంతో ఇప్పుడైతే ప్లాస్టిక్ వాడకుండా మహేష్ ఉంటున్నాడు. కానీ, మహేష్ బాబు ప్లాస్టిక్‌ను తెగ వాడటంతో పాటు ప్రమోట్ కూడా చేశాడు. గతంలో ఆయన కొన్ని కూల్ డ్రింగ్స్ యాడ్స్ చేశాడు. ఆ కూల్ డ్రింగ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఉండేవి. అలాగే ఓ మసాలా యాడ్ కూడా చేశాడు. అది కూడా ప్లాస్టిక్ కవర్‌లోనే ఉంటుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×