E-Paper
Advertisement

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు
Advertisement

BJP Congress: నాంపల్లిలో బీజేపీ కార్యాలయ గేటుకు నల్లరంగు పూయడంతో మొదలైన వివాదం.. ఆ తర్వాత పరస్పర నిరసనలు, దాడుల ఆరోపణల వరకు వెళ్లింది. నల్గొండలో నిన్న ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారు. ఇవాళ భువనగిరిలోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భువనగిరిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికా? అంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. భువనగిరి ఘటనకు నిరసనగా చౌటుప్పల్‌లో బీజేపీ ఆందోళనకు దిగింది. చెప్పాలంటే ఈ ఘటనలు విచిత్రంగా బీజేపీ ప్రభావం తక్కువగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయ్. ఒకే జిల్లాలో వరుసగా దాడులు, ఆందోళనలు చోటుచేసుకోవడం, వ్యవహారం రచ్చరచ్చగా మారడం సంచలనమవుతోంది. ఇవి ఎటు దారి తీస్తాయన్న ఆందోళన కూడా ఉంది.

Tags

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×