E-Paper
Advertisement

ఒకే ఒక్క టాబ్లెట్ తో కంట్రోల్ తప్పే అమ్మాయిలు… కట్ చేస్తే చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్ట్

ఒకే ఒక్క టాబ్లెట్ తో కంట్రోల్ తప్పే అమ్మాయిలు… కట్ చేస్తే చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్ట్
Advertisement

Telugu Thriller Series: అమ్మాయిలను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ చాలామంది వశీకరణం చేసి ఆడవాళ్లను లోబర్చుకోవచ్చు అని నమ్ముతారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే తెలుగు థ్రిల్లర్ సిరీస్ లో మాత్రం ఒకే ఒక్క టాబ్లెట్ తో కంట్రోల్ తప్పేలా చేస్తారు. ఆ తరువాత వచ్చే ట్విస్ట్ కు బుర్ర బద్దలవ్వాల్సిందే. ఆ సిరీస్ పేరే ‘ది కల్ట్: సిస్టర్స్ ఇన్ బ్లడ్’ (The Cult: Sisters in Blood). రక్తం నైవేద్యం సమర్పించే రహస్య ముఠా చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

కథలోకి వెళ్తే…

కథ ఒక అడవి ప్రాంతంలో జరిగే యువతుల దారుణమైన హత్యలతో షురూ అవుతుంది. మూఢనమ్మకాలతో ఒక నిర్దిష్టమైన పూజా విధానాన్ని పాటిస్తూ చేసిన నరబలి అది. పోలీసులు చూడగానే ఈ విషయాన్ని కనిపెడతారు. రక్తం నైవేద్యంగా సమర్పించి, శరీరాలను చనిపోయిన స్థితిలో వదిలేసి ఉండటం పోలీసులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన కర్ణ రంగంలోకి దిగుతాడు.

Advertisement

కర్ణ టాలెంటెడ్ ఆఫీసర్. తీగ లాగి డొంకను కదిలించే రకం. ఈ కేసు దర్యాప్తులో మానవ ప్రవర్తన, వింత సంప్రదాయాలపై పరిశోధన చేసే ఒక మహిళా రీసెర్చర్ తోడవుతుంది. దర్యాప్తు జరుగుతున్నకొద్దీ ఒక ప్రమాదకరమైన మూఢనమ్మకాల ముఠా గురించి క్లూస్ దొరుకుతాయి. అమాయక ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుని, రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఒక రహస్య గుడిని నడిపే ముఠా దీని వెనుక ఉందని తెలుసుకుంటారు.

మళ్లీ జన్మించడానికి 37 నరబలులు ఇవ్వాలి అనే ఒక భయంకరమైన నమ్మకంతో నడుస్తుంది ఈ నెట్‌వర్క్. వీళ్ళ అసలు ప్లాన్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ లో నెమ్మదిగా బయట పడుతుంది. కర్ణ, సదరు రీసెర్చర్ స్వయంగా ఆ ముఠా పన్నిన కుట్రల వలలో చిక్కుకుంటారు. మరి ఈ దారుణాల నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా బయట పడ్డాడు ? ఆ రీసెర్చర్ ఎవరు ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ తెలుగులో సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

మూడనమ్మకాలను ఆయుధంగా మార్చుకుని మనుషులను ఎలా బలితీసుకుంటారో ఇందులో కళ్ళు తెరిపించేలా చూపించారు. 2026లో తెరపైకి వచ్చిన ఈ సిరీస్ చాయ్ బిస్కెట్ ఒరిజినల్స్‌గా రిలీజ్ అయ్యింది. తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మినీ వెబ్ సిరీస్ ‘ది కల్ట్’లో రాహుల్ సిప్లిగంజ్ ఇన్‌స్పెక్టర్ కర్ణగా నటించాడు. ఈ సిరీస్ Chai Shots Appలో తెలుగు భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతీక్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్ లో సీజన్ 2 ‘ది కల్ట్ 2 – ది ఫైనల్ రిచ్యువల్’ కూడా విడుదలైంది.

Read Also: అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×