E-Paper
Advertisement

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ
Advertisement

Crime Comedy Thrillers: ఓ చిన్న దొంగతనంతో మొదలైన గేమ్… కట్ చేస్తే కోట్ల రూపాయల బెట్టింగ్, కోట్ల విలువైన మోసం, చివరికి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఒక ప్రొఫెషనల్ కాన్ ఆర్టిస్ట్ తనకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన యువతిని ప్రేమిస్తే ? ఆ తర్వాత ఆమెనే తనకు ప్రత్యర్థిగా మారితే ? ఒకరి ప్లాన్‌ ను మరొకరు ముందే ఊహిస్తూ, చివరి వరకు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో అర్థం కాకుండా కథ సాగితే ? విల్ స్మిత్, మార్గోట్ రాబీ జంటగా నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘Focus’ ఇప్పటికీ ట్విస్టులతో ఆకట్టుకునే అద్భుతమైన సినిమాల్లో ఒకటి. మరి ఈ దొంగల ఆటలో అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

నిక్కీ స్పర్జన్ ఓ ప్రొఫెషనల్ కాన్ ఆర్టిస్ట్. జనాలను మోసం చేయడంలో అతనికి తనదైన టెక్నిక్స్ ఉంటాయి. ఓసారి జెస్ అనే యువతి అతని దగ్గరకు వచ్చి తనను కూడా ఈ దొంగతనాల ప్రపంచంలోకి తీసుకెళ్లమని అడుగుతుంది. నిక్కీ ఆమెకు ఒక్కో ట్రిక్ నేర్పిస్తూ ఉండగా, ఇద్దరి మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. కానీ జెస్ తనకు మరీ దగ్గరవుతుందని భావించిన నిక్కీ ఆమెను వదిలి వెళ్లిపోతాడు.

Advertisement

మూడేళ్ల తర్వాత నిక్కీ బ్యూనస్ ఎయిర్స్‌ లో ఓ భారీ స్కామ్ కోసం రంగంలోకి దిగుతాడు. అంతా తన కంట్రోల్‌ లో ఉందని అనుకునే సమయంలో జెస్ మళ్లీ అతని జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ అప్పట్లో తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అమాయకురాలు ఇప్పుడు పాత జెస్ కాదు. ఆమె కూడా తెలివైన కాన్ ఆర్టిస్ట్‌ గా మారి నిక్కీ ప్లాన్‌ కు అడ్డుగా నిలుస్తుంది.

ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య అసలు మైండ్ గేమ్ మొదలవుతుంది. ఎవరు నిజం చెబుతున్నారు ? ఎవరు నటిస్తున్నారు ? ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు ? పెద్ద స్కామ్ వెనుక ఉన్న అసలు టార్గెట్ ఎవరు ? నిక్కీ వేసిన ప్లాన్‌ లో జెస్‌ కు ఏం కావాలి ? చివరికి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు థ్రిల్.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

గ్లెన్ ఫికారా, జాన్ రిక్వా దర్శకత్వం వహించిన ‘ఫోకస్’లో విల్ స్మిత్, మార్గోట్ రాబీ, రోడ్రిగో శాంటోరో, అడ్రియన్ మార్టినెజ్, జెరాల్డ్ మెక్‌రేనీ తదితరులు నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 45 నిమిషాలు. ఇది క్రైమ్, కామెడీ, డ్రామా, రొమాన్స్, హీస్ట్ అంశాలతో తెరకెక్కింది. 2015లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 158.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే సుమారు రూ.1300 కోట్లకు పైగానే. ప్రస్తుతం IMDbలో 6.6 రేటింగ్ ఉంది. ప్రస్తుతం Amazon Videoలో రెంట్‌కు తీసుకునే ఆప్షన్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఇంగ్షీషులోనే చూడాలి. కాన్ ఆర్టిస్టుల మైండ్ గేమ్స్, రొమాన్స్, కామెడీ, ఊహించని మలుపులు చూడాలి అనుకునే వారికి ఈ మూవీ మంచి ఫన్ థ్రిల్లర్.

Read Also: ఆమె గుర్తొస్తే గుండెల్లో కోత… కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమ ప్రయాణం

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×