Tamil Sports Drama: క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలు కేవలం గెలుపోటములను మాత్రమే కాకుండా, ఒక సాధారణ క్రీడాకారుడు సమాజంలో తన గుర్తింపు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం చేసే కఠినమైన పోరాటాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. అలాంటి ఇన్స్పిరేషనల్ అండ్ ఎమోషనల్ అంశంతో తెరకెక్కించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘అంగీకారం’ (Angikaaram). ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు… పరుగు పందెంలో దేశస్థాయిలో రికార్డులు సృష్టిస్తాడు. తన ప్రతిభతో కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికవుతాడు. కానీ అతని ప్రతిభ కంటే కులం, డబ్బు, రాజకీయ పలుకుబడికే విలువ ఇచ్చిన వ్యవస్థ అతని అవకాశాన్ని లాగేసుకుంటే? ఆటలో గెలవాల్సిన అథ్లెట్… చివరికి కోర్టులోనే తన పోరాటం మొదలుపెడితే? క్రీడా ప్రపంచంలోని వివక్ష, అవినీతి, సామాజిక అసమానతలను కోర్ట్‌రూమ్ డ్రామాతో కలిపి చూపించిన ఈ సినిమా కథేంటి? ఆథిరన్‌కు జరిగిన అన్యాయం ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథ చెన్నైలోని ఓ మురికివాడకు చెందిన ఆథిరన్‌తో మొదలవుతుంది. చిన్నప్పటి నుంచే పరుగు పందెంలో అతనికి అసాధారణ ప్రతిభ ఉంటుంది. తల్లి శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంటుంది. పేదరికం ఉన్నా ఆథిరన్ తన కలను మాత్రం వదులుకోడు. కోచ్ రుద్ర పర్యవేక్షణలో కఠినంగా శిక్షణ తీసుకుంటూ జాతీయ స్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాడు.
అతని ప్రతిభకు గుర్తింపుగా కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయ్యే అవకాశం వస్తుంది. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. స్పోర్ట్స్ అసోసియేషన్‌లోని అవినీతి అధికారులు, రాజకీయ పలుకుబడితో తమకు నచ్చిన అథ్లెట్లను ముందుకు తీసుకురావాలని చూస్తారు. అర్హత ఉన్న ఆథిరన్‌ను మాత్రం జాబితా నుంచి తొలగిస్తారు. తనకు ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం వ్యవస్థలోని రాజకీయాలు, సామాజిక వివక్ష కారణంగా అవకాశం కోల్పోవడంతో ఆథిరన్ షాక్ అవుతాడు. కానీ అక్కడితో వెనక్కి తగ్గడు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంటాడు.
అతని అక్క లా స్టూడెంట్ కావడంతో ఆమె సహాయంతో కోర్టును ఆశ్రయిస్తాడు. కోర్టు వేదికగా తన వ్యక్తిగత సమస్యను మాత్రమే కాకుండా… ప్రతిభ ఉన్నప్పటికీ పేదరికం, కులం, సామాజిక స్థితి కారణంగా వెనుకబడిపోతున్న ఎంతోమంది అథ్లెట్ల సమస్యను కూడా ప్రశ్నిస్తాడు. ఒకవైపు ఆథిరన్ తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని పోరాడుతుంటే… మరోవైపు అతన్ని అడ్డుకోవడానికి స్పోర్ట్స్ వ్యవస్థలోని పెద్దలు తమ అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. దీంతో ఈ పోరాటం కేవలం ఒక అథ్లెట్ అవకాశానికి సంబంధించినది కాకుండా… ఒక వ్యక్తి తన గుర్తింపు, గౌరవం, హక్కు కోసం చేసే పోరాటంగా మారుతుంది.
మరి ఆథిరన్ తనకు దక్కాల్సిన అవకాశాన్ని తిరిగి సాధించుకున్నాడా ? కోర్టులో అతని వాదనకు న్యాయం జరిగిందా ? వ్యవస్థలోని అవినీతిని బయటపెట్టగలిగాడా? చివరికి అతని ‘అంగీకారం’ ఎలా వచ్చింది ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు కథ.
‘అంగీకారం’ సినిమాకు థేన్‌పతియన్ దర్శకత్వం వహించారు. కోటపాడి జె. రాజేష్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రేవతి, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించగా, పీటర్ హెయిన్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2026 జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ తమిళ కోర్ట్‌రూమ్ స్పోర్ట్స్ డ్రామా యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కింది. థియేట్రికల్ రన్ అనంతరం ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ఆహా తమిళం (Aha Tamil), జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లలో సెప్టెంబర్ 2026లో ఓటీటీ ప్రసారానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం Astro Go అనే ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చింది. కానీ తెలుగులో లేదు.
Read Also: మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్