BigTV English

Horror Thriller Movie OTT : గజ గజ వణికించే సీన్స్.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

Horror Thriller Movie OTT : గజ గజ వణికించే సీన్స్.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

Horror Thriller Movie OTT : భయంకరమైన హారర్ సన్నివేశాలతో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే ఓటీటీలో దెయ్యాల కథలతో వచ్చే సినిమాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. భయపడుతూ సినిమాలు చూడాలని కొంతమంది అనుకుంటారు. అందులోనే థ్రిల్ ఉందని వెతుకుంటారు.. ఈ జానర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే గతంలో వచ్చిన హారర్ సినిమాలను కూడా కొందరు చూసేందుకు ఇష్టపడతారు. హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా హారర్ సినిమాలు ఉంటాయి. ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు స్ట్రీమింగ్ కు వచ్చిన మూవీస్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. హెరడెటరీ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. ఏ ఓటీటీ లో మూవీని చూడొచ్చనది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


వణికించేలా ఎన్నో రకాల సినిమాలు హాలీవుడ్ నుంచి వచ్చాయని అందరికి తెలిసిందే. ఆ సినిమాల్లో నిజంగానే దెయ్యాలు ఇలా ఉంటాయా? అనే సందేహాలు కలిగించేలా రియల్ గా కనిపించే విధంగా సినిమాలను తెరకెక్కిస్తారు. ఆ సినిమాలు ఈ మధ్య తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక ఓటీటీ సంస్థలు హారర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. మంచి హారర్ మూవీ చూడాలని అనుకొనేవారికి హెరడెటరీ మూవీ బాగా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ థ్రిల్లర్ మూవీ 2018 లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. సూపర్ టాక్ తెచ్చుకొని బ్లాక్‍బస్టర్ అయింది. 10 మిలియన్ డాలర్స్ తో తెర కెక్కిన ఈ మూవీ 88 మిలియన్ డాలర్స్ ను అందుకోవడం మామూలు విషయం కాదు..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఒక మహిళ ఒక గ్రామంలో తన భర్త, కొడుకు, మతిస్థిమితం లేని తన కూతురుతో నివసిస్తుంది. తన తల్లి ఎలెన్ చనిపోయిందని తెలుసుకొని అంత్యక్రియలకు వెళతారు. ఆ తర్వాత యానీ కుటుంబానికి అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆత్మ వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ క్రమంలో భయానక విషయాలను ఎదుర్కొంటారు. ఓ దశలో ఆమె కూతురు చర్లీ తల, మొండెం వేరు అవుతాయి. అది చూసిన ఆమె భయంతో వణికి పోతుంది.. ఆమె కుటుంబానికి అది పెద్ద శాపంగా మారుతుంది.. దాని నుంచి బయట పడేందుకు ఆ కుటుంబం ఎంతో కష్టపడుతుంది. మొత్తానికి స్టోరీ అయితే ఆడియన్స్ బాగా థ్రిల్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో టోనీ కొలెట్, అలెక్స్ వుల్ఫ్, గాబ్రియెల్ బ్రైన్, మిల్లీ షార్పిరో, క్రిస్టీ సమ్మర్‌హైస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆరీ యాస్టర్ దర్శకత్వం వహించారు.. ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసిన ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి..  ఇలాంటి జోనర్ లో మూవీ రావడం మొదటి సారి. గతంలో కానీ, ఈ మధ్య ఇలాంటి న్యాచురల్ గా కనిపించే సినిమాలు రాలేదు.. ఓటీటీ లో తమ యూజర్స్ ను ఆకట్టుకొనేందుకు పాత సినిమాలను తీసుకొస్తున్నారు..


Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×