OTT Movie : టైటిల్ ను చూసి ఇదేదో ఆ టైపు మూవీ అయ్యుంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కేవలం ఒక సీన్ మాత్రమే ఆలు అసలు కథ వేరేగా ఉంది. ఇది సూపర్ హీరో కామెడీ సిరీస్. సామాన్య జీవితాలలో అసాధారణ శక్తులు, హాస్యం, హార్ట్ టచింగ్ క్షణాలు ప్రేక్షకులను నవ్విస్తూ, ఆలోచింపజేస్తాయి. మీరు కూడా కామెడీ, రొమాన్స్, అనూహ్యమైన సూపర్ పవర్ ట్విస్ట్‌లతో నిండిన కథలను ఇష్టపడితే ఈ ఓటీటీ సజెషన్ మీ కోసమే. ఈ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
సూపర్ పవర్స్ తో అబ్బుర పరిచే ఈ సిరీస్ పేరు Extraordinary. జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. సీజన్ 1 నిడివి 8 ఎపిసోడ్‌లు (ప్రతి ఎపిసోడ్ సుమారు 25-30 నిమిషాలు), మొత్తం 4 గంటలు. ఇందులో మైరీడ్ టైర్స్ (జెన్), సియోబాన్ కుల్లెన్ (జిజ్), బిలాల్ హస్నా (క్యాష్), లూక్ రోలసన్ (లూక్), సోఫియా ఆక్సెన్‌హామ్ (మేరీ), ఆర్డల్ ఓ’హాన్‌లోన్ (ఆండీ), సామ్యూల్ ఆండర్సన్ (జోర్డ్) తదితరులు ఇందులో నటించారు. అయితే కొంచం మెచ్యూర్డ్ సీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు స్కిప్ చేస్తేనే బెటర్.
స్టోరీలోకి వెళ్తే…
కథ జెన్ (మైరీడ్ టైర్స్) అనే 25 ఏళ్ల యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక అసాధారణ ప్రపంచంలో నివసిస్తుంది. ఇక్కడ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సూపర్ పవర్‌ను పొందుతారు. ఎగరడం, ఆకారం మార్చడం, లేదా టైంని కంట్రోల్ చేయడం వంటివి. కానీ, జెన్ ఒక్కదానికే అక్కడ ఎటువంటి శక్తి ఉండదు. దీనివల్ల ఆమె తనను తాను సాధారణ అమ్మాయి అని భావిస్తూ, జీవితంలో అసంతృప్తితో ఉంటుంది. లండన్‌లో ఒక చిన్న జాబ్‌లో పనిచేస్తూ, తన స్నేహితులతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉంటూ, జెన్ తన శక్తిని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది.
అదే సమయంలో తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి కష్టపడుతుంది. జెన్ రూమ్‌మేట్‌లు… ఆకార మార్పిడి శక్తి కలిగిన వ్యక్తి క్యాష్ (బిలాల్ హస్నా), వాయిస్ తో ఇతరులను కంట్రోల్ చేసే అమ్మాయి జిజ్ (సియోబాన్ కుల్లెన్). వీళ్ళిద్దరూ జెన్‌కు సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటారు. క్యాష్, తన శక్తిని ఉపయోగించి పార్టీలలో సరదాగా గడుపుతుంటాడు. కానీ జీవితంలో సరైన దిశ లేక అల్లాడుతుంటాడు. జిజ్ జెన్‌తో సన్నిహిత స్నేహితురాలిగా ఉంటూనే, ఆమెను ఎప్పుడూ ఉత్సాహపరుస్తుంది. జెన్ తల్లి మేరీ వస్తువులను పేల్చగలదు. ఆండీ ఒకే సమయంలో రెండు చోట్ల ఉండగలడు. కానీ జెన్‌తో వారి సంబంధం ఒడిదొడుకులతో సాగుతుంది.
Read Also : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే
ఇక్కడే కథలో ఒక కీలకమైన ట్విస్ట్ వస్తుంది. జెన్ ఒక “పవర్ క్లినిక్”లో తన శక్తిని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది, కానీ అక్కడ ఆమెకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆమెకు శక్తి లేకపోవడానికి కారణం ఆమె తల్లి ఒక సీక్రెట్‌ను దాచడం. ఇదే సమయంలో జెన్ లూక్ అనే సాధారణ శక్తి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడుతుంది. కానీ అతని గతంలోని రహస్యాలు జెన్‌ను అనుమానంలో పడవేస్తాయి. ఆ తరువాత ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రీఎంట్రీ తో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఇంతకీ జెన్ కు శక్తి లేకపోవడానికి కారణం ఏంటి? ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ లో ఆమె ఎవరిని సెలెక్ట్ చేసుకుంది? హీరోయిన్ కు ఉన్న అసలు బలం ఏంటి? అన్నది స్టోరీ.