BigTV English
Advertisement

OTT Movie : కొండెక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : కొండెక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ …  అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : తింటే గారెలే తినాలి, చుస్తే ఇండోనేషియన్ హారర్ సినిమాలే చూడాలి అన్నట్లు ఉంది పరిస్థితి. నిజమే నండోయ్, ఈ సినిమాలు చేతబడి, అతీంద్రీయ శక్తులతో వణుకు పుట్టిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది.  ఈ ఇండోనేషియన్ సినిమా మొదటి మూడు రోజుల్లో 800,000 వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. ఇది హారర్ సినిమానే అయినా,అడ్వెంచర్ థ్రిల్లింగ్ ను ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో

‘Petaka Gunung Gede’ 2025లో విడుదలైన ఇండోనేషియన్ ఫోల్క్ హారర్-అడ్వెంచర్ సినిమా. అజ్హర్ కినోయ్ లుబిస్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అర్లా ఐలానీ (మాయా), అద్జానా అషెల్ (ఇటా), ఎండీ ఆర్ఫియన్ (అలే), రైహాన్ ఖాన్ (ఇంద్రా), మొహమ్మద్ ఇక్బాల్ సులైమాన్ (ఉస్తాద్), టెయుకు రిఫ్ను వికానా (రాకిబ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 6న ఇండోనేషియా సినిమాహాళ్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 1 గంట 38 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.5/10 రేటింగ్ ఉంది. ఈ ఇండోనేషియన్ సినిమా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా కథ మాయా (అర్లా ఐలానీ), ఇటా (అద్జానా అషెల్) అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు చిన్నప్పటి నుండి సన్నిహితంగా ఉంటారు. స్కూల్ సెలవుల సమయంలో, మాయా అన్నయ్య ఇంద్రా (రైహాన్ ఖాన్) అతని స్నేహితులు అలే (ఎండీ ఆర్ఫియన్), అక్రి (జెరెమీ మోర్మాన్స్), ఉస్తాద్ (మొహమ్మద్ ఇక్బాల్ సులైమాన్)తో కలిసి పశ్చిమ జావాలోని పర్వతాన్ని (Mount Gede) ఎక్కాలని ప్లాన్ చేస్తారు. మాయా, ఇటా ఈ ట్రిప్‌లో చేరాలని ఉత్సాహంగా తమ తండ్రులని అడుగుతారు. మాయాకు తన తండ్రి రాకిబ్ నుండి అనుమతి సులభంగా లభిస్తుంది. కానీ ఇటాకు ఆమె తండ్రి అనుమతి ఇవ్వడానికి కొంత ఒప్పించడం అవసరం అవుతుంది.

చివరకు ఈ బృందం పర్వతాన్ని ఎక్కడానికి బయలుదేరుతుంది. ఇక ఈ పర్వతాన్ని ఎక్కడం కూడా సాగుతుంది. ఈ బృందం ట్రెక్కింగ్ లో ఉండగా ఇటా మెన్స్ట్రుయేషన్ సమయంలో ఉందని తెలుస్తుంది. అయితే స్థానిక నమ్మకాల ప్రకారం ఆ సమయంలో స్త్రీలు ఇలాంటి పవిత్ర పర్వతాలను ఎక్కకూడదు. ఎందుకంటే ఇది అతీంద్రియ శక్తులను వశం చేసుకుంటుందని, ఆత్మలు కూడా కోపగించవచ్చని నమ్ముతారు. ఈ విషయం తెలిసిన బృందంలో భయం, ఆందోళన మొదలవుతుంది. మాయా, ఇటాను తిరిగి వెనక్కి వెళ్లమని చెప్తుంది. కానీ ఇటా తన స్నేహితురాలితో ఈ అడ్వెంచర్‌ను కొనసాగించాలని పట్టుబడుతుంది.

Read Also : టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

ఎందుకంటే ఆమె తండ్రి ఆమెను మళ్లీ ఇలాంటి ట్రిప్‌కు అనుమతించకపోవచ్చనుకుంటుంది. ఈ నిర్ణయం ఒక భయంకరమైన పీడకలగా మారుతుంది. ఈ ప్రయాణంలో ఇటా అనారోగ్యానికి గురవుతుంది. వాంతులు, మూర్ఛలు ప్రారంభమవుతాయి. ఇటా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆమె కడుపు అసాధారణంగా ఉబ్బి గర్భవతిలా కనిపిస్తుంది. ఈ సమయంలో, ఈ బృందం ట్రిప్‌ను రద్దు చేసి వెనక్కి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ ఇటా పరిస్థితి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మెరుగుపడదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఇటా ఆరోగ్యం మరింత దిగజారుతుంది. ఆ తరువాత స్టోరీలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇక క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. ఇటా చివరికి ఏమవుతుంది ? నిజంగానే అతీంద్రీయ శక్తుల వల్లే ఇలా జరిగిందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే , ఈ ఇండోనేషియన్ ఫోల్క్ హారర్-అడ్వెంచర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Big Stories

×