Lemon Crushing Ritual: భారతీయులు ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఎన్నో ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి కొత్త వాహనం టైర్ల కింద నిమ్మకాయ లేదంటే కొబ్బరికాయ పెట్టి ముందుకు నడిపించడం. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఈ ఆచారం చాలా సాధారణం. దీని వెనుక ఉన్న సాంప్రదాయ, సాంస్కృతిక, మతపరమైన నమ్మకాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ దుష్టశక్తుల నివారణ: నిమ్మకాయ లేదంటే కొబ్బరికాయను దుష్టశక్తులు లేదంటే చెడు దృష్టి తగలకుండా కాపాడుతుందని చాలా మంది భావిస్తారు. అందుకే కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు, దానిపై చెడు దృష్టి, ప్రతికూల శక్తులు పడకుండా ఈ ఆచారం పాటిస్తారు. నిమ్మకాయలోని సహజమైన ఆమ్ల గుణాలు ప్రతికూల శక్తులను శోషించి నాశనం చేస్తుందని నమ్ముతారు.
⦿ శుభప్రదం: కొత్త వాహన ప్రారంభం శుభకరంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. నిమ్మకాయ లేదంటే కొబ్బరికాయ వాహనం టైర్ల కింద ఉంచి ముందుకు తీసుకెళ్లడాన్ని శుభ ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో, కొబ్బరికాయ, నిమ్మకాయను దేవతలకు సమర్పించే పవిత్ర వస్తువుగా భావిస్తారు. వాహనం టైర్ల కింద నలపడం ద్వారా దేవతల ఆశీర్వాదం పొందుతారని నమ్ముతారు. కొబ్బరికాయను శ్రీఫలం అని పిలుస్తారు. ఇది సంపద, శ్రేయస్సు, మరియు శుభానికి చిహ్నం. కొన్ని ప్రాంతాలలో కొత్త వాహనాల పూజలో కొబ్బరికాయను ఉపయోగిస్తే, మరికొన్ని చోట్ల నిమ్మకాయ లేదంటే గుమ్మడికాయను ఉపయోగిస్తారు.
⦿ శాస్త్రీయ ఆలోచన: ఈ ఆచారం పూర్తిగా సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడినది. శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, మనస్సుకు సానుకూల భావనను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని చాలా మంది భావిస్తారు. నిమ్మకాయ, కొబ్బరికాయను నలపడం వల్ల వాహనం టైర్లు, యాంత్రిక స్థితిపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, ఇది ఒక సాంస్కృతిక సంకేతంగా పనిచేస్తుంది.
⦿ ప్రాంతీయ విశేషాలు: దక్షిణ భారతదేశంలో కొత్త వాహనాల పూజలో కొబ్బరికాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో వాహనం టైర్ల కింద కొబ్బరి కాయ ఉంచుతారు. ఉత్తర భారతదేశంలో నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొత్త ఇల్లు, దుకాణం, వ్యాపారం ప్రారంభించినప్పుడు కూడా ఈ ఆచారం పటిస్తారు.
Read Also: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
సో, వాహనం టైర్ల కింద నిమ్మకాయ, కొబ్బరికాయ పెట్టే ఆచారం ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక నమ్మకంగానే కొనసాగుతుంది. ఇది శుభప్రదంగా, సురక్షితంగా ప్రయాణం ప్రారంభించడానికి ఒక సంకేతంగా పని చేస్తుంది. శాస్త్రీయంగా నిరూపితం కానప్పటికీ, ఈ ఆచారం, సాంప్రదాయం, విశ్వాసాలను గౌరవించే విధంగా జరుగుతుంది. ఆనాదిగా వస్తున్న ఆచారానికి సంబంధించి ప్రశ్నలను కాకుండా పాజిటివ్ కోణంలోనే చూడాలంటారు పెద్దలు.
Read Also: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!