Road Accident: రాఖీ పండగ వేళ నిజామాబాద్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నవీపేట్ మండలం జగ్గారావు ఫారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు సాయిబాబు (19) స్పాట్ లోనే మృతిచెందాడు. బైక్, కంటైనర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాసరకు చెందిన సాయిబాబు రాఖీ కట్టించుకునేందకు నిజామాబాద్ లో ఉన్న తన అక్క వద్దకు బైక్ పై వెళ్లాడు. వెళ్లి రాఖీ కూడా కట్టించుకున్నాడు. అక్కా, తమ్ముళ్ల అప్యాయంగా కాసేపు అలా మాట్లాడుకున్నారు. అనంతరం, సాయిబాబు అతను ద్విచక్ర వాహనంపై తన స్వస్థలమైన బాసరకు తిరిగి బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో జగ్గారావు ఫారం వద్ద అతని బైక్ ఒక కంటైనర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ALSO READ: మురుగునీటి నుంచి బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..?
ఈ ప్రమాదంలో సాయిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడు అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అరవింద్‌ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటన గురించి వివరించారు. ప్రమాదం జరిగిన స్థలంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పండుగ సమయంలో జరిగిన ఈ దుర్ఘటన వల్ల సాయిబాబు కుటుంబం, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200
రక్షా బంధన్ అనేది సోదరీసోదరుల మధ్య బంధాన్ని బలోపేతం చేసే పవిత్రమైన పండుగ. ఈ సందర్భంగా సాయిబాబు తన అక్కతో ఆనందంగా గడిపిన క్షణాలు, కొద్ది గంటల్లోనే విషాదంగా మారాయి. ఈ ఘటన రోడ్డు భద్రత గురించి మరోసారి ఆలోచింపజేస్తుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తుంది. అలాగే, ట్రాఫిక్ జామ్ లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా ఈ దుర్ఘటన గుర్తుచేస్తుంది. సాయిబాబు మృతి గురించి తెలిసిన గ్రామస్తులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఒక హృదయ విదారక సంఘటనగా నిలిచిపోతుంది
ALSO READ: SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..
తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన..
పండగవేళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా దారుణ విషాదం చోటుచేసుకుంది. వెంకటాయపాలెంలో రెండు బైక్ లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శంకర్, సువర్ణరాజు అనే వ్యక్తులు మృతిచెందారు. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు యాదవోలు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పెద్దేవంకు చెందిన శంకర్ అని వ్యక్తి మృతిచెందాడు. ఈ మరణ వార్త తెలిసిన కాసేపటికే తన తండ్రి శ్రీను గుండెపోటుతో ప్రాణాలను కోల్పోయాడు. పండగవేళ తండ్రికొడుకులు చనిపోవడంతో పెద్దేవంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.