BigTV English

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie :  ఊహించని ట్విస్ట్‌లతో ఒక ఎంటర్‌టైనింగ్ హీస్ట్ సినిమాను చూడాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే జపాన్ సినిమాను చూసేయండి. ఈ సినిమాలో మీకు కావాల్సినంత ఎంటరైన్మెంట్ దొరుకుతుంది. ముగ్గురు దొంగలు ఒక డైమండ్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ సినిమా స్టోరీ హాంగ్ కాంగ్‌లో జరుగుతుంది. ఇది రొమాంటిక్, క్రిమినల్ ట్విస్ట్‌లతో మీకొక సరదా రైడ్‌ను అందిస్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘The Confidence Man JP’ ఒక జపాన్ కామెడీ-క్రైమ్ చిత్రం. ఈ సినిమాకి ర్యో టనాకా దర్శకత్వం వహించారు. ఇందులో మసామి నాగసావా (డాకో), మసాహిరో హిగషిడే (బోకు-చాన్), ఫుమియో కోహినాటా (రిచర్డ్), షిన్యా కోటే (ఇగరాషి), లిసా ఓడా (మోనాకో), యుకో టకేయుచి (రాన్ రియు), హరుమా మియురా (జెస్సీ) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది 2018లో అదే పేరుతో విడుదలైన టీవీ సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చింది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ హాంగ్ కాంగ్‌లో ఉండే డాకో, బోకు-చాన్, రిచర్డ్ అనే ముగ్గురు ప్రొఫెషనల్ కాన్ ఆర్టిస్ట్‌ల చుట్టూ తిరుగుతుంది. వీరి లక్ష్యం హాంగ్ కాంగ్‌లోని ఒక శక్తివంతమైన రాన్ రియు అనే మాఫియా క్వీన్. ఆమెను “ఐస్ ప్రిన్సెస్” అని కూడా పిలుస్తారు. ఆమె వద్ద ఉన్న అత్యంత విలువైన పర్పుల్ డైమండ్‌ను దొంగిలించడం ఇప్పుడు ఈ ముగ్గురూ లక్ష్యంగా పెట్టుకుంటారు. రాన్ రియు నమ్మకాన్ని పొందడానికి డాకో, బోకు-చాన్, రిచర్డ్ వివిధ రూపాల్లో, వ్యూహాలతో ప్రయత్నిస్తారు. డాకో తన అసాధారణమైన తెలివితేటలతో, రాన్ రియును మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. బోకు-చాన్ తన నిజాయితీతో, కొన్నిసార్లు ఈ మోసాలను చేయడానికి ఆలోచిస్తాడు. కానీ డాకో ధైర్యం చెప్పడంతో కొనసాగుతాడు. రిచర్డ్ తన అనుభవంతో, ఈ ప్లాన్‌ను సమర్థవంతంగా నడిపిస్తాడు.

Read Also : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

అయితే వారి ప్లాన్‌లో జెస్సీ అనే ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. జెస్సీ కూడా రాన్ రియు డైమండ్‌ను దొంగిలించేందుకు పోటీపడతాడు. ఇది కథకు ఒక రొమాంటిక్ కాంపిటీటివ్ ట్విస్ట్‌ను ఇస్తుంది. ఈ మధ్యలో అకాబోషి అనే మాఫియా వ్యక్తి, డాకో గతంలో 2 బిలియన్ యెన్‌లకు మోసం చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హాంగ్ కాంగ్‌కు వస్తాడు. వీళ్లంతా చివరికి రాన్ రియు డైమండ్ కోసం పోటీపడతారు. ఇక క్లైమాక్స్ వరకు సినిమా అనేక ట్విస్ట్‌లతో నడుస్తుంది. ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ డైమండ్ ఎవరికి దొరుకుతుంది ? దానిని దొంగిలించడానికి వీళ్లంతా ఎలాంటి ప్లాన్‌ లు అమలు చేస్తారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×