OTT Movie : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. వీటిలో భయపెట్టే సీన్స్, ఉత్కంఠతను పెంచే స్టోరీ కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయి. అయితే ఈ జానర్ లో లేటెస్ట్ గా విడుదలైన ఒక మరాఠీ సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటోంది. ఇది కాంకణ్ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగే కథ. మూఢనమ్మకాలు, మంత్రవిద్య, మానసిక గందరగోళంతో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ మరాఠీ హారర్ సినిమాపేరు ‘Jarann’ హృషికేశ్ గుప్తే దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో 2025 జూన్ 6న విడుదలైంది. 2025 ఆగస్ట్ 8 నుండి ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఇందులో అమృతా సుభాష్ (రాధా), అనితా దాటే-కేల్కర్ (గంగుటి), కిషోర్ కదమ్ (డాక్టర్ ధనంజయ్ కులకర్ణి), జ్యోతి మాల్షే (డాక్టర్ రష్మి పండిత్), అవనీ జోషి (సాయి), రాజన్ భిసే (రాధా తండ్రి), సీమా దేశ్ముఖ్ (రాధా తల్లి) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 5 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
స్టోరీలోకి వెళితే
ఈ కథ రాధా అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త శేఖర్, కూతురు సాయితో సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. అయితే రాధా బాల్యంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆమె బాల్యంలో, కాంకణ్‌లోని ఒక గ్రామంలో తమ పూర్వీకుల ఇంటిలో, గంగుటి అనే వృద్ధ మహిళ అద్దెకు నివసిస్తుండేది. గ్రామస్తులు గంగుటిని మంత్ర గత్తెగా (బ్లాక్ మ్యాజిక్) భావిస్తారు. ఆమెను గ్రామం నుండి తరిమివేయడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తారు. ఈసమయంలో గంగుటి రాధాపై ఒక శాపం విధిస్తుంది. ఆమె జీవితం ఎప్పటికీ శాంతిగా ఉండదని చెప్పి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, రాధా తన కుటుంబంతో తమ పూర్వీకుల ఇంటిని రిసార్ట్‌గా మార్చడానికి వస్తుంది. ఈ ఇంటిలో సాయి ఒక పాత బొమ్మ ను కనిపెడుతుంది. ఇది గంగుటిదని రాధా తల్లిదండ్రులు గుర్తిస్తారు. ఈ బొమ్మ రాధా మానసిక గందరగోళాన్ని మరింత పెంచుతుంది. రాధా తన గతం కారణంగా ఇప్పటికే మానసిక చికిత్సలో ఉంటుంది. డాక్టర్ ధనంజయ్ కులకర్ణి, డాక్టర్ రష్మి పండిత్ ఆమెను చూస్తుంటారు. అయితే ఈ ఇంటికి వచ్చినప్పటినుంచి, రాధా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది.
Read Also : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే
ఆమెకు తన భర్త శేఖర్ కారు ప్రమాదంలో చనిపోయినట్టు కలలు కూడా వస్తాయి. ఆమె సాయిని తన కూతురుగా భావిస్తుంది. అయినప్పటికీ కథలో ఒక షాకింగ్ ట్విస్ట్ ద్వారా సాయి ఆమె సొంత కూతురు కాదని తెలుస్తుంది. రాధా తన బాల్య స్నేహితులతో కలిసి ఒక ప్లాంచెట్ గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ సమయంలో, ఆమె గంగుటి ఆత్మను సమన్ చేసినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆమె ప్రవర్తన తీరు మారిపోతుంది. అక్కడ ఆమె అందరినీ భయపెడుతుంది. ఇక క్లైమాక్స్ మరో లెవల్ కి వెళ్తుంది. గంగుటి ఆత్మ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? రాధా ఈ శాపం నుంచి బయట పడుతుందా ? ఆమె కూతురికి ఏం జరుగుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.