Sri Tej Health Update : సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) రష్మిక మందన్న(Rashmika Mandanna) , అనసూయ(Anasuya), సునీల్(Sunil ), ఫహాద్ ఫాజిల్(Fahad Fazil), జగపతిబాబు(Jagapathibabu) తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్ర బృందం శ్రమించింది.. వారి కష్టానికి ప్రతిఫలం లభించింది. ముఖ్యంగా విడుదలైన 15 రోజుల్లోనే రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సంతోషాన్ని చిత్ర బృందం అనుభవించలేకపోతోందని చెప్పవచ్చు. దీనికి కారణం ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన అని చెప్పాలి.
హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఇక ఆ షో చూడడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా ర్యాలీ చేసుకుంటూ రావడంతో తమ అభిమాని హీరోని కలవడానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో రేవతి అక్కడికక్కడే మరణించింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ (9) ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పలువురు సెలబ్రిటీలు హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హాస్పిటల్ వైద్య బృందం శ్రీ తేజ్ (Sri Tej) ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.
కుటుంబాన్ని గుర్తుపట్టలేకపోతున్న శ్రీ తేజ్.
ఇకపోతే వైద్యులు తెలిపిన సమాచారం మేరకు.. ప్రస్తుతం వెంటిలేటర్ సహాయం లేకుండానే చికిత్సకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ తేజ్ అవయవాలు సొంతంగా తమ పనులు నిర్వహించడం మొదలుపెట్టాయి. ఇకపోతే కళ్ళు తెరుస్తూ మూస్తున్నారు కానీ కుటుంబాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. అలాగే తాను చెప్పాలనుకున్న విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నారు. కానీ నరాల పనితీరు కాస్త మెరుగుపడింది. అతని అవయవాలలో దృఢత్వం కనిపించింది. దీనికోసం మందులు కూడా ఇస్తున్నాము. ప్రస్తుతం ఆహారం ముక్కు ద్వారా పంపిస్తున్నాము” అంటూ వైద్యులు తెలియజేశారు. ఈ విషయం తెలిసి శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
కొడుకు పరిస్థితిపై తండ్రి కన్నీరు మున్నీరు..
ఇకపోతే శ్రీ తేజ్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన మాట్లాడుతూ..” నా కొడుకు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కళ్ళు తెరుస్తున్నాడు. మూస్తున్నాడు. కానీ నన్ను గుర్తుపట్టే పరిస్థితుల్లో లేడు. శ్రీ తేజ కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నా కూతురు అమ్మ ఎక్కడ అని అడిగితే ఊరెళ్ళింది వస్తుంది అని చెబుతోంది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే తనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలిచిందని, వారు ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు సాగుతున్నానని తెలిపారు. అంతేకాదు మంత్రి కోమటిరెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కు అందిందని కూడా తెలిపారు శ్రీ తేజ్ తండ్రి.