OTT Movie : క్రైమ్ డ్రామాలు ఉత్కంఠభరితమైన సీన్స్, అనూహ్య మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా అక్రమ డబ్బు సంపాదన, కుటుంబ బంధాలు, నైతిక సంఘర్షణలు వంటి అంశాలు కలగలిసిన కథలు ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సిరీస్ లను చూడాలనుకుంటే ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ క్రైమ్ డ్రామా ఒక కుటుంబం డబ్బు అక్రమ రవాణా (మనీ లాండరింగ్) ప్రపంచంలో చిక్కుకుని, దాని నుంచి బయట పడడానికి పోరాడే కథను ఊహించని ట్విస్టులతో హార్ట్ బీట్ పెరిగే రేంజ్ లో చూపిస్తుంది. ఈ సిరీస్ ఎక్కడ చూడొచ్చు? స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ సిరీస్ పేరు ‘Ozark’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. సిరీస్ 4 సీజన్‌లు, 44 ఎపిసోడ్‌లు (సీజన్ 1-3: 10 ఎపిసోడ్‌లు, సీజన్ 4 – 14 ఎపిసోడ్‌లు), ప్రతి ఎపిసోడ్ 51-80 నిమిషాలు ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు చూడాల్సిన సిరీస్ అన్నమాట. ఇందులో జాసన్ బాటెమన్ (మార్టీ), లారా లిన్నీ (వెండీ), సోఫియా హబ్లిట్జ్ (చార్లెట్), స్కైలర్ గేర్ట్నర్ (జోనాహ్), జూలియా గార్నర్ (రూత్), లిసా ఎమెరీ (డార్లీన్), ఫెలిక్స్ సోలిస్ (నవారో), జానెట్ మెక్‌టీర్ (హెలెన్) తదితరులు నటించారు. ఈ సిరీస్ లో హింస, భాష, సున్నితమైన అంశాలు ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూడకపోతే బెటర్.
స్టోరీలోకి వెళ్తే…
కథ మార్టీ బైర్డ్, అతని కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మార్టీ ఒక సాధారణ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా చికాగోలో జీవిస్తుంటాడు. కానీ రహస్యంగా మెక్సికన్ డ్రగ్ కార్టెల్‌కు డబ్బు అక్రమ రవాణా చేస్తుంటాడు. అతని భార్య వెండీ (లారా లిన్నీ) ఒక రాజకీయ పీఆర్ నిపుణురాలు. వారి ఇద్దరు పిల్లలు… చార్లెట్ (సోఫియా హబ్లిట్జ్), జోనాహ్ (స్కైలర్ గేర్ట్నర్)కు తమ తండ్రి రహస్య జీవితం గురించి అంతగా తెలియదు. 2007లో మార్టీ, అతని భాగస్వామి బ్రూస్ నవారో కార్టెల్‌కు డబ్బు లాండరింగ్ ప్రారంభిస్తారు.
కానీ 2017 నాటికి బ్రూస్ కార్టెల్ నుండి $8 మిలియన్లు దొంగిలించడం వల్ల సమస్యలు మొదలవుతాయి. కార్టెల్ నాయకుడు కామినో “డెల” డెల్ రియో ఈ విషయాన్ని గుర్తించి… బ్రూస్‌ను, అతని సహచరులను చంపేస్తాడు. మార్టీ తన ప్రాణం కాపాడుకోవడానికి, మిస్సౌరీలోని లేక్ ఆఫ్ ది ఓజార్క్స్‌లో కొత్త లాండరింగ్ ఆపరేషన్‌ను స్థాపించి, 5 సంవత్సరాలలో $500 మిలియన్లు లాండర్ చేస్తానని ఒప్పందం చేసుకుంటాడు. డెల్ అతనికి $8 మిలియన్లు తిరిగి చెల్లించడానికి కొన్ని రోజుల గడువు ఇస్తాడు. మార్టీ తన కుటుంబాన్ని చికాగో నుండి ఓజార్క్స్‌లోని ఒక రిమోట్ సమ్మర్ రిసార్ట్ ప్రాంతమైన ఓసేజ్ బీచ్‌కు తరలిస్తాడు. అక్కడ వాళ్ళు మరో సమస్యలో చిక్కుకుంటారు.
Read Also : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే
సిరీస్ లో ఓ ఎపిసోడ్ లో వచ్చే క్లాస్ రూమ్ సీన్ ఎపిక్ గా ఉంటుంది. క్లాస్ లో ఒక విద్యార్థిని ప్రైవేట్ ఫోటో లీక్ అవుతుంది. దీనివల్ల ఆ అమ్మాయి హర్ట్ అవుతుంది. వెండీ సోదరుడు బెన్ ఆ అమ్మాయి బాధను చూసి కోపంతో, క్లాస్‌లోని అందరి ఫోన్‌లను తీసుకుని, విద్యార్థులను “ఎమోషనల్ టెర్రరిస్ట్‌లు” అని తిడతాడు. ఆ ఫోన్‌లను స్కూల్ వెలుపల ఉన్న ఒక వుడ్ చిప్పర్‌లో వేసి నాశనం చేసే సీన్ హైలెట్ గా ఉంటుంది. ఇంతకీ మార్టీ ఫ్యామిలీ ఈ సమస్యల నుంచి ఎలా బయట పడింది? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.