NZ vs Zim: న్యూజిలాండ్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన రెండో టెస్టులో… కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 359 పరుగుల తేడాతో జింబాబ్వే పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 601 పరుగులు చేయగా.. రెండోసారి బ్యాటింగ్ చేయకముందే… జింబాబ్వే జట్టును కట్టడి చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో ఏకంగా 359 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టుపై విజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు.
Also Read: Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?
359 పరుగులతో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ
న్యూజిలాండ్ వర్సెస్ జింబాబ్వే మధ్య రెండో టెస్టు క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ బులావాయే వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు ఏడో తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్… ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ మూడు రోజులకే ఈ మ్యాచ్ ఫినిష్ చేశారు. అంటే ఇవాళ ఉదయమే మ్యాచ్ ఫినిష్ అయింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా జింబాబ్వే అతి తక్కువ పరుగులకే… ఆల్ అవుట్ కావడం జరిగింది.
Also Read: Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్
48.5 ఓవర్లలో జింబాబ్వే 125 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇది మొదటి ఇన్నింగ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మ్యాట్ హేర్రీ 15 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. అలాగే జకరీ ఏకంగా 38 పరుగులు ఇచ్చి…. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక మరో బౌలర్ ఫిషర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్ ఆడింది. ఈ సందర్భంగా 130 ఓవర్లు వాడిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు నసపై 601 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇందులో కాన్వే 153 పరుగులు చేయగా.. విల్ యంగ్ 74 పరుగులతో రెచ్చిపోయాడు.
అటు హెన్రీ నికోలస్ 150 పరుగులు చేయక రచిన్ రవీంద్ర 165 పరుగులతో దుమ్ము లేపారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 28 ఓవర్లలో 117 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో జింబాబ్వే జట్టు పైన 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక న్యూజిలాండ్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో అద్భుతంగా రాణించిన… మాట్ హేనరీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డే వన్ కాన్వే కు దక్కింది. ఇది ఇలా ఉండగా మొదటి టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వే కూడా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ కూడా న్యూజిలాండ్ ఎగరేసుకు పోయింది అన్నమాట.