BigTV English

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అంటే చాలామంది మధ్యతరగతి ప్రజలకు తమ జీవితకాల సంపాదన అందులో ధారపోస్తారు. అలాంటి సందర్భంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లను మోసం చేసిన ఘటనలు న్యూస్ పేపర్లలో చదువుతున్నాం. వందల కోట్ల రూపాయలు దండుకొని ఆయా కంపెనీల యజమానులు బోర్డు తిప్పేసి పత్తా లేకుండా పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోయినప్పటికీ కస్టమర్లకు ప్లాట్లను అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో అంతిమంగా నష్టపోయేది కష్టమర్ అని చెప్పవచ్చు.


అయితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు క్లియర్ టైటిల్ గురించి స్పష్టంగా అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. అంటే మీరు కొనుగోలు చేయబోయే ఆస్తి వివాదరహితంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడాన్నే క్లియర్ టైటిల్ అని పిలుస్తారు. ఉదాహరణకు మీరు ఒక 200 గజాల ప్లాటు కొనుగోలు చేస్తున్నారు అనుకుందాం. దానికి సంబంధించిన సేల్ డీడ్, రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుంటే సరిపోదు. దీనిపై సుప్రీంకోర్టు కూడా గతంలో భూ యజమానిగా గుర్తింపు కోసం కేవలం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోదని తేల్చి చెప్పింది. భూ యాజమాన్యం నిరూపించుకోవడానికి ఇతర డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటేనే క్లియర్ టైటిల్ అవుతుందని సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. ఈ నేపథ్యంలో అసలు క్లియర్ టైటిల్ అంటే ఏంటి.. ఒక ప్లాటు కొనుగోలు చేసే ముందు ఏమేం డాక్యుమెంట్లను తనిఖీ చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

సేల్ డీడ్:


ఇది అత్యంత కీలకమైన పత్రం భూమిని ఒకరి చేతి నుంచి మరొక చేతికి అమ్ముతున్నట్లు క్రయవిక్రయాలు నిరూపించే పత్రం. మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేశాము అని చెప్పుకోవడానికి కీలకమైన డాక్యుమెంట్ ఇదే. ఇందులో అత్యంత ముఖ్యంగా మీరు కొనుగోలు చేసిన భూమి సరిహద్దులు, ఆ భూమి కొలతలు, సర్వే నెంబర్లు, అలాగే మీరు ఎవరిని కొనుగోలు చేశారో వారి వివరాలు, దాంతో పాటు మీ వివరాలు కూడా అందులో పొందుపరిచి ఉంటాయి, ఈ సేల్ డీడ్ అనేది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేస్తారు. ఈ డాక్యుమెంట్లో భూమిని ఎంతకు కొనుగోలు చేశారో దాని విలువ కూడా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ అనేది అత్యంత కీలకం. ఇది మీకు భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైనటువంటి సమస్యలు ఏర్పడిన కీలక సాక్ష్యం కింద ఉపయోగపడుతుంది

ఈసీ సర్టిఫికెట్:

దీనిని ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్స్ అని కూడా పిలుస్తారు. మీరు కొనుగోలు చేసే భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉన్నప్పటికీ ఇందులో నమోదు అయి ఉంటాయి. ఈ పత్రాన్ని మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పొందవచ్చు., తద్వారా ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఈసీ లో పొందవచ్చు. ముఖ్యంగా భూమిని ఎవరైనా తాకట్టు పెట్టారా, భూమిపైన ఏమైనా అప్పులు గాని ఇతర లావాదేవీలు కానీ ఉన్నాయా వాటి విషయాలను ఈసీ సర్టిఫికెట్ ద్వారా తెలుసుకోవచ్చు.

టైటిల్ డీడ్:

మీరు కొనుగోలు చేసిన భూమి అమ్మకం దారుడికి ఎలా లభించింది అనేది సూచించేదే టైటిల్ డీడ్. ఇందులో ముఖ్యంగా మీకు ఎవరైతే భూమిని విగ్రహిస్తున్నారో అతడికి సేల్ డీడ్ ద్వారా లభించిందా, లేక గిఫ్ట్ డీడ్, వారసత్వంగా హక్కుగా లభించిందా అనేది ఈ టైటిల్ డీడ్ లో స్పష్టంగా పేర్కొని ఉండాలి. టైటిల్ డీడ్ సరిగ్గా ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి. అలాగే లింక్ డాక్యుమెంట్స్ అంటే గతంలో ఈ భూమి ఎవరెవరి చేతులు మారింది. అనే వివరాలతో కూడిన నకలు డాక్యుమెంట్స్ కూడా పరిశీలించాలి.

ల్యాండ్ రికార్డ్స్:

మీరు కొనుగోలు చేసిన భూమి ల్యాండ్ రికార్డ్స్ లో ఏ కేటగిరీలో ఉందో ముందుగా చెక్ చేసుకోవాలి అందులో స్పష్టంగా భూమికి సంబంధించిన యజమాని పేరు, సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, వంటివి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసి ఉంటాయి.

లేఅవుట్ అప్రూవల్:

మీరు కొనుగోలు చేసే భూమి నివాసయోగ్యమైనదా లేక వ్యవసాయ క్షేత్రమా అనేది ఈ పత్రం సూచిస్తుంది. సాధారణంగా హైదరాబాదులో డిటిసిపి, హెచ్ఎండిఏ దీనికి సంబంధించిన లేఅవుట్ అప్రూవల్స్ అందిస్తున్నాయి. ఇది ప్రభుత్వ సంస్థలు వీటి ఆమోదం లేకుండా లేఅవుట్ లో నిర్మాణాలు చేయలేము,

లీగల్ ఒపీనియన్ తప్పనిసరి:

మీరు భూమిని కొనుగోలు చేసే ముందు లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవడం తప్పనిసరి అనే సంగతి గుర్తుంచుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై అనుభవం ఉన్నటువంటి లీగల్ ఎక్స్ పర్ట్ ద్వారా డాక్యుమెంట్స్ వివరాలను తనిఖీ చేయించడం మంచిది ఎందుకంటే స్థిరాస్తి కొనుగోలు అనేది జీవితకాల పెట్టుబడి. కనుక ఆచితూచి అన్ని డాక్యుమెంట్లు సరి చేసుకున్న తర్వాతనే మీరు చివరికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Related News

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Big Stories

×