OTT Movie : ఫాంటసీ-అడ్వెంచర్ సినిమాలు మనల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళతాయి. జానపద కథలు, అతీంద్రియ అనుభవాలు, సాధారణ వ్యక్తుల సాహసాలు కలిసి మనల్ని ఉత్కంఠగాఉంచుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫిలిప్పీన్ సినిమా, ఫిలిప్పీన్ జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఒక యువకుడి చేసే సాహస యాత్ర చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా ఫిలిప్పీన్ సంస్కృతిని, అడవులు, అగ్నిపర్వత దృశ్యాలను అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
కథ ఏంటంటే
ఈ కథ జాసన్ (బ్రియాన్ సై) అనే ఫిలిప్పీన్ యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను తన తండ్రి మరణం తర్వాత, తన తండ్రి స్వస్థలమైన ఫిలిప్పీన్స్‌కు వెళ్తాడు. తన తండ్రి చెప్పిన జానపద కథలు నిజమేనా?” అని సరదాగా ఆలోచిస్తూ, ఫిలిప్పీన్స్‌లోని సోర్సోగన్ అడవుల్లోకి ఒక సాహస యాత్రకు బయలుదేరతాడు. అక్కడ అతను మాగయోన్ (మెర్సిడెస్ కాబ్రాల్) అనే ఒక అతీంద్రియ మహిళను కలుస్తాడు. ఆమె ఒక ఫిలిప్పీన్ జానపద దేవత. ఆమెను “వుమన్ ఇన్ ది వుడ్స్” అని పిలుస్తారు. మాగయోన్ ఒక అగ్నిపర్వత ద్వీపానికి తిరిగి వెళ్లాలనే క్వెస్ట్‌లో ఉంటుంది. జాసన్‌ను, “హే, నాకు హెల్ప్ చెయ్!” అని సరదాగా అడుగుతుంది. జాసన్ మొదట “ఇది ఏమిటి, నేను హీరోనా?” అని గందరగోళంలో పడతాడు. కానీ ఆమెతో కలిసి సాహస యాత్రలో జాయిన్ అవుతాడు.
Read Also : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్
ఈ యాత్రలో జాసన్ వివిధ జానపద జీవులను ఎదుర్కొంటాడు. ఒక చెట్టు ఆత్మ, ఒక యోధుడు ఇవన్నీ ఫిలిప్పీన్ జానపద కథల నుండి వచ్చినవి. ఈ సమయంలో జాసన్ మాగయోన్‌తో స్నేహం పెంచుకుంటాడు. ఆమె అగ్నిపర్వత ద్వీపంలో తన గమ్యాన్ని చేరుకోవడానికి సహాయపడతాడు. ఒక ట్విస్ట్‌లో మాగయోన్ ఒక దేవత మాత్రమే కాదు, ఒక అగ్నిపర్వత ఆత్మ కూడా అని తెలుస్తుంది. ఆమె ద్వీపాన్ని కాపాడటానికి తిరిగి వెళ్లాల్సిఉంటుంది. జాసన్ తన భయాలను అధిగమించి, మాగయోన్‌కు సహాయం చేస్తాడు. ఒక అగ్నిపర్వత ద్వీపంలో ఒక ఆత్మ శక్తిని ఆమెకు తిరిగి వచ్చేలా చేస్తాడు. ఇక మామూలుగానే క్లైమాక్స్ చిన్న ట్విస్ట్‌తో ఎండ్ అవుతుంది. జాసన్ తన తండ్రి చెప్పిన జానపద కథలను నమ్ముతాడా ? మాగయోన్ తో ప్రేమలో పడతాడా ? ఈ యాత్ర విజయవంతమవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Woman in the Woods’ ఒక ఫాంటసీ-అడ్వెంచర్‌సినిమా. కెవిన్ ఆంగ్ దీనికి దర్శకత్వం అందించారు. ఇందులో మెర్సిడెస్ కాబ్రాల్ (మాగయోన్), బ్రియాన్ సై (జాసన్)ప్రధాన పాత్రల్లో నటించారు. 2021 జనవరి 5న ఈ సినిమా Tubi, Amazon Prime, Google Playలో విడుదలైంది. 1 గంట 28 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది.