E-Paper
Advertisement

ఒంటరి తండ్రిని వదిలేసి పార్టీకి వెళ్లాలనుకున్న కొడుకు… చివరికి అదే తండ్రి కోసం మారిపోయిన కథ

ఒంటరి తండ్రిని వదిలేసి పార్టీకి వెళ్లాలనుకున్న కొడుకు… చివరికి అదే తండ్రి కోసం మారిపోయిన కథ
Advertisement

Feel Good Drama: పార్టీకి వెళ్లాలి… ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి… తనకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. కానీ ఇంట్లో మంచానికే పరిమితమైన తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటే? ఓ వైపు టీనేజ్ వయసులోని కోరికలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు మధ్య ఇరుక్కుపోయిన ఓ కుర్రాడి జీవితంలో ఒక్క రోజు ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో చూపించే ఎమోషనల్ డ్రామా ‘Olmo’. ‘Minari’, ‘Moonlight’ చిత్రాల నిర్మాతల నుంచి వచ్చిన ఈ సినిమా కుటుంబం, తండ్రి కొడుకుల బంధం, టీనేజ్‌లో వచ్చే స్వార్థం, బాధ్యత వంటి అంశాలను చాలా సహజంగా చూపిస్తుంది. తండ్రి కొడుకుల బంధం, టీనేజ్ ఎమోషన్స్, కుటుంబ బాధ్యతలు, సున్నితమైన కామెడీ కలిసిన కథలు ఇష్టపడేవారికి ‘Olmo’ మంచి ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామా

కథలోకి వెళ్తే…

కథ 1979లో న్యూ మెక్సికోలో జరుగుతుంది. 14 ఏళ్ల ఒల్మో తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి జీవిస్తుంటాడు. అతని తండ్రి నెస్టర్ అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉంటాడు. తల్లి పని చేస్తుండటంతో ఇంట్లో తండ్రిని చూసుకునే బాధ్యత ఒల్మో, అతని అక్కపై పడుతుంది. కానీ తన వయసులో ఉన్న ఏ కుర్రాడిలాగే ఒల్మోకు కూడా తనకంటూ ఓ ప్రపంచం ఉంటుంది.

Advertisement

అతనికి బెస్ట్ ఫ్రెండ్ మిగ్యుయెల్ ఉంటాడు. పక్కింట్లో ఉండే నినా అంటే కూడా ఒల్మోకు క్రష్. ఒకరోజు నినా తనను పార్టీకి పిలవడంతో అతని ఆనందానికి హద్దులుండవు. కానీ అదే రోజు తండ్రిని చూసుకునే బాధ్యత కూడా అతనిపైనే ఉంటుంది. పార్టీకి వెళ్లాలనే కోరిక, తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్లకూడదనే బాధ్యత మధ్య ఒల్మో ఇరుక్కుపోతాడు. చివరికి పార్టీకి వెళ్లేందుకు అతను చేసే ప్రయత్నాలు ఊహించని గందరగోళానికి దారితీస్తాయి.

అయితే తన తండ్రిని చూసుకోవడం ఒల్మోకు ఎందుకు అంత భారంగా అనిపిస్తుంది? తండ్రి అనారోగ్యం అతని జీవితాన్ని ఎలా మార్చింది? ఆ ఒక్క రోజు జరిగిన సంఘటనల తర్వాత కుటుంబం గురించి అతని ఆలోచన ఎలా మారుతుంది? తనకు తప్పించుకోవాలనిపించిన ఇల్లే చివరికి తనకు ఓదార్పు ఇచ్చే ప్రదేశంగా ఎలా మారుతుంది? అనేదే ఈ సినిమాలో చూడాల్సిన అసలు ఎమోషన్.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

ఫెర్నాండో ఐంబ్కే దర్శకత్వం వహించిన ‘Olmo’లో ఐవాన్ ఉత్తాప, గుస్తావో సాంచెజ్ పార్రా, ఆండ్రియా సువారెజ్ పాజ్, డియెగో ఒల్మెడో, రోసా ఆర్మెండారిజ్, మెలానీ ఫ్రోమెటా ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా రన్‌టైమ్ 1 గంట 24 నిమిషాలు. ‘Olmo’ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది. ఆగస్టు 28 నుంచి Amazon Prime Video స్ట్రీమింగ్‌కు వచ్చింది.

Read Also: పిల్లలను ఎత్తుకెళ్లే సీరియల్ కిల్లర్… 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… తెలుగులో సైకో థ్రిల్లర్ స్ట్రీమింగ్

Related News

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

Big Stories

Advertisement
×