E-Paper
Advertisement

అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన జంట… పోలీసులకే చెమటలు… సీట్ ఎడ్జ్ డ్రామా

అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన జంట… పోలీసులకే చెమటలు… సీట్ ఎడ్జ్ డ్రామా
Advertisement

Intense Action Thriller: మాఫియా సామ్రాజ్యాలు, సీక్రెట్ గ్యాంగ్‌లు, అధికారం కోసం జరిగే ప్రతీకార పోరాటాల నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఆడియన్స్‌కు ఒక రకమైన హై-వోల్టేజ్ థ్రిల్‌ను ఇస్తాయి. అండర్‌వరల్డ్‌ను తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి ఒక శక్తివంతమైన జంట వేసే తెలివైన నెట్‌వర్క్, వారిని మట్టుబెట్టడానికి లా అండ్ ఆర్డర్ చేసే సాహసోపేతమైన పోరాటం ఆధారంగా రూపొందిన పక్కా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కేజెక్యూ: కింగ్ జానీ క్వీన్’ (KJQ: King Jackie Queen Movie). మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

పార్థ అలియాస్ కింగ్, జాకీ చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులు. చిన్నతనంలో ఎదురైన కష్టాలు వాళ్లిద్దరినీ నేర ప్రపంచం వైపు నడిపిస్తాయి. కాలం గడిచేకొద్దీ తమ క్రూరత్వం, తెలివితో హైదరాబాద్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్స్‌గా ఎదుగుతారు. ఒకరి కోసం మరొకరు ప్రాణాలిచ్చేంత నమ్మకం వీళ్ల మధ్య ఉంటుంది.

Advertisement

కానీ వీళ్ల జీవితాల్లోకి భార్గవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. గతంలో మోసపోయి నటిగా మారిన భార్గవి… తనకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకోవాలని చూస్తుంటుంది. అయితే ఆమెను చూసే విషయంలో కింగ్, జాకీల ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అధికారం, అహంకారంతో నిండిపోయిన కింగ్… భార్గవిని తన అదుపులో ఉంచుకోవాలని చూస్తాడు. కానీ జాకీ మాత్రం ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమెకు అండగా నిలబడాలని ప్రయత్నిస్తాడు. దీంతో ఇంతకాలం ఒకటిగా ఉన్న ఇద్దరు స్నేహితుల మధ్య మొదటిసారి విభేదాలు మొదలవుతాయి.

ఒకవైపు కింగ్‌కు అధికారం, తన మాటే చెల్లాలనే పట్టుదల. మరోవైపు జాకీకి భార్గవిని కాపాడాలనే భావన. ఈ ఇద్దరి ఆలోచనల మధ్య మొదలైన చిన్న ఘర్షణ క్రమంగా పెద్ద పోరాటంగా మారుతుంది. ఇక భార్గవి జీవితంలో దాగి ఉన్న గతం, కింగ్ చేసే నిర్ణయాలు, జాకీ తీసుకునే రిస్కులు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. స్నేహం, ప్రేమ, నమ్మకం, అధికారం… ఒక్కొక్కటి ఒక్కో వైపు లాగడంతో ముగ్గురి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి.

Advertisement

అసలు భార్గవి రాకతో కింగ్, జాకీల మధ్య ఇంత పెద్ద గొడవ ఎందుకు వచ్చింది? స్నేహాన్ని కాపాడుకోవడానికి జాకీ ఎంత దూరం వెళ్లాడు? అధికారం కోసం కింగ్ ఏం చేశాడు? చివరికి ఈ ముగ్గురి కథ ఎలాంటి విషాదకరమైన మలుపు తీసుకుంది? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు విషయం.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

ఈ సినిమాకు కేకే దర్శకత్వం వహించారు. దీక్షిత్ శెట్టి పార్థ అలియాస్ కింగ్‌గా, శశి ఓదెల జాకీగా, యుక్తి తరేజా భార్గవిగా నటించారు. పూర్ణచంద్ర తేజస్వీ సంగీతం అందించగా, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఆగస్టు 28 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా చూడొచ్చు.

Read Also: మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×