E-Paper
Advertisement

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్
Advertisement

Turkish Crime Thriller Series: మహిళల ఇళ్లకు ఒకే రకమైన విచిత్రమైన బాక్సులు వస్తుంటాయి. మొదట వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ బాక్సులు వచ్చిన మహిళలే ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగినట్టుగా కనిపించే ఈ కేసులన్నింటి వెనుక ఒకే క్రిమినల్ నెట్‌వర్క్ ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో సిరీస్ మాత్రం సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తుంది. మహిళలపై జరిగే నేరాలను ఇన్వెస్టిగేట్ చేసే చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఓనెమ్ చుట్టూ సాగే టర్కిష్ క్రైమ్ మిస్టరీ సిరీస్ ‘Graveyard’ సీజన్ 3 ఇప్పుడు Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి కేసు కేవలం ఒక హత్య దగ్గర ఆగిపోదు. మహిళలను టార్గెట్ చేస్తున్న ఓ పెద్ద కుట్ర బయటపడటంతో దర్యాప్తు మరింత ప్రమాదకరంగా మారుతుంది. మరి ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ విచిత్రమైన బాక్సులకు ఈ కేసులతో సంబంధం ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సీజన్ 3లో ఓనెమ్ తన టీమ్‌తో కలిసి మళ్లీ క ఠినమైన కేసుల దర్యాప్తులోకి వస్తుంది. ఈసారి టర్కీలోని పలువురు మహిళల ఇళ్లకు అనుమానాస్పదమైన బాక్సులు చేరుతుంటాయి. మొదట ఒక్కో సంఘటన విడివిడిగా జరిగినట్టే కనిపిస్తుంది. కానీ దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ ఆ బాక్సులకు, మహిళలపై జరుగుతున్న హత్యలకు మధ్య సంబంధం ఉందని పోలీసులకు అర్థమవుతుంది.

Advertisement

ఇక్కడి నుంచి ఓనెమ్ టీమ్‌కు అసలు సవాలు మొదలవుతుంది. ఒక్కో కేసును విడిగా పరిష్కరించడం కంటే, వాటన్నింటినీ కలుపుతున్న దారాన్ని కనిపెట్టాల్సి వస్తుంది. గతంలో జరిగిన పరిష్కారం కాని మహిళా హత్యల కేసులు కూడా మళ్లీ తెరపైకి వస్తాయి. ఓనెమ్ తిరిగి డ్యూటీలోకి రావడం ఆమె టీమ్‌కే కాదు, ఆమె వ్యక్తిగత జీవితానికి కూడా పెద్ద పరీక్షగా మారుతుంది.

మరోవైపు కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మహిళలపై ద్వేషంతో పనిచేస్తున్న క్రిమినల్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు బయటపడతాయి. ఓనెమ్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పాత కేసులను కూడా తిరిగి పరిశీలిస్తుంది. అయితే దర్యాప్తు ఎంత ముందుకు వెళ్తే అంత ప్రమాదం ఆమె టీమ్‌కు దగ్గరవుతుంది. అసలు ఆ బాక్సులు ఎవరు పంపిస్తున్నారు? మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అన్ని కేసుల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా? లేక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందా? అనేదే సిరీస్‌లో అసలు మిస్టరీ.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

అబ్దుల్లా ఓగుజ్, ఓమెర్ బేకుల్ దర్శకత్వంలో రూపొందిన ‘Graveyard’ సీజన్ 3లో బిర్చే అకలాయ్, ఓల్గున్ టోకర్, షెహ్సువర్ అక్తాస్, హకాన్ మెరిచ్లిలర్ తదితరులు నటించారు. ఈ సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ‘Graveyard’ సీజన్ 3 ఆగస్టు 28, 2026 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, టర్కిష్ ఆడియోతో పాటు తెలుగులో కూడా దీనిని చూడవచ్చు .  పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ క్లూస్, డార్క్ క్రైమ్ మిస్టరీలు ఇష్టపడేవారికి ‘Graveyard’ సీజన్ 3 మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.

Read Also: ఆకలితో మొదలైన గేమ్… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగులు… ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తెలుగులోనే

Tags

Related News

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×