E-Paper
Advertisement

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం
Advertisement

Goat Theft: మహబూబాబాద్ జిల్లాలో మేకల దొంగలు హల్చల్ చేశారు. పోలీసులకే షాక్ ఇచ్చేలా చేసారు. వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితు కానిస్టేబుల్‌‌ను చూసి అలాగే వెలుతూ కారుతో కానిస్టేబుల్‌ని ఢీకొట్టి దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. కారులో పోలీసుల కళ్లు కప్పి కారులో మేకల చోరికి పాల్పడ్డారు.

తనికీల్లో..

అయితే ఓక్క కారులో దాదాపుగా ఏడు మేకలు ఎక్కించారు. తనికీల్లో అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి నిందితులు చివరకు పోలీసులకు చిక్కారు. వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఊహించని ఘటన ఎదురైంది. మరిపెడ మండలంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులలో కానిస్టేబుల్ రవి తేజను గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

Also read: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

కారు కదలికలపై ఆరా..

అనుమానం వచ్చిన పోలీసులు కారు కదలికలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కారులో ఉన్న వ్యక్తులు మేకల దొంగలుగా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరిపెడ మండలం ఎల్లారిగూడెం గ్రామానికి చెందిన పలువురి మేకలను కారులో అపహరించి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మొత్తం 7 మేకలు..

Advertisement

మేకలను తరలించేందుకు Honda Amaze కారును ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కారును తనిఖీ చేయగా మొత్తం 7 మేకలను పోలీసులు రికవరీ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కానిస్టేబుల్ రవి తేజను కారుతో ఢీకొట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో దొంగల పై హత్యాయత్నం కేసుతో పాటు దొంగతనం కేసు నమోదు చేశారు. పోలీసులు. మేకల దొంగతనానికి పాల్పడుతున్న నిందితులు, పోలీసుల వాహన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు 2 కోట్ల టోకరా!

Tags

Related News

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ!

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్ర కేసీ వేణుగోపాల్‌తో సమావేశం, హస్తినకు కొందరు నేతలు పయనం

“చెరువులను మింగేసే వాళ్ల ఆటలు సాగవ్!”.. అంబర్‌పేట్ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×