E-Paper
Advertisement

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!
Advertisement

PM Shahbaz Shareef:  ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (FIFA World Cup 2026 tournament) చివరి దశకు వచ్చేసింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఈనెల 20వ తేదీన అంటే ఎల్లుండి అర్ధరాత్రి 12:30 గంటలకు జరగనుంది. న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియం వేదికగా అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ (Argentina vs. Spain) జట్ల మధ్య ఈ బిగ్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి తర్వాత ఈ మ్యాచ్ ఉండనుంది. అమెరికాలో మాత్రం మధ్యాహ్న 3 గంటలకు సాగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Pakistan PM Shahbaz Shareef) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం పాకిస్తాన్ లోనే తయారైన ఫుట్ బాల్స్‌ ఎంపిక చేశారని ప్రధాని షరీఫ్ తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ తయారైన నాణ్య‌మైన‌ ఫుట్ బాల్స్ కార‌ణంగానే ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్ అంటూ ఆ దేశ ప్ర‌ధాని షెహబాజ్ షరీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

ఫిఫా వరల్డ్ కప్ బంతులు ఎక్క‌డ త‌యారు అవుతాయంటే?

Advertisement

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో (FIFA World Cup 2026 tournament) ఉపయోగించే ఫుట్ బాల్స్ పాకిస్తాన్ లోనే తయారవుతున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. పాకిస్తాన్ దేశంలోని సియాల్ కోట్ నగరంలో ఈ బంతులను తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ఫార్వార్డ్ స్పోర్ట్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఫిఫా వరల్డ్ కప్ నకు సంబంధించిన బంతులు తయారవుతున్నాయి. ఈ వరల్డ్ కప్ కోసం 70% బంతులను పాకిస్తానే అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Pakistan PM Shahbaz Shareef ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిఫా వరల్డ్ కప్ కోసం తమ వద్ద బంతులను తీసుకుంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ లో ఈ బంతులను తయారు చేయడం వల్లనే.. ఆ టోర్నమెంట్ సక్సెస్ అయిందని కూడా విర్రవీగుతూ కామెంట్ చేశారు.

ఒక్కో బంతి ధర ఎంత అంటే ?

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లలో వినియోగించే బంతులు పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో తయారవుతాయి. అయితే ఇందులో వాడే ఒక్కో బంతి ధర 170 డాలర్లు. అంటే ఒక్కో బంతి ధర 15 వేల రూపాయలుగా ఉంది. అడిడాస్ కంపెనీ కంటే, ఫార్వార్డ్ స్పోర్ట్స్ అనే సంస్థ త‌యారు చేసిన బంతుల‌కే డిమాండ్ ఎక్కువ‌.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×