E-Paper
Advertisement

అనుమానంతో ఒకరిని ఒకరు చంపుకునే పోలీసులు.. ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో సీట్ ఎడ్జ్ ఇస్తున్న థ్రిల్లర్

అనుమానంతో ఒకరిని ఒకరు చంపుకునే పోలీసులు.. ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో సీట్ ఎడ్జ్ ఇస్తున్న థ్రిల్లర్
Advertisement

Revenge Crime Thriller OTT : వర్షం కురుస్తున్న రాత్రి… ఉరుములు, మెరుపుల మధ్య కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో ఓ పోలీస్ స్టేషన్. కమ్యూనికేషన్ కట్ అయిపోయిన పరిస్థితిలో ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేని భయం. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే సమయం… ఒకరిపై ఒకరు అనుమాన పడుతూ, చివరికి చంపుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది ? ఇలాంటి ఉత్కంఠభరితమైన కాన్సెప్ట్ తో రూపొందిన మిస్టరీ రివేంజ్ థ్రిల్లర్ Shesha 2016. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

సన్ నెక్స్ట్ ఓటీటీలో

ఇటీవల కాలంలో ఓటీటీల్లో సస్పెన్స్, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్లకు ఆడియన్స్ లో బాగా ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకే రాత్రిలో జరిగే కథలు, పరిమిత పాత్రల మధ్య సాగే ఇంటెన్స్ డ్రామాలపై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు ప్రేక్షకులు. అదే తరహాలో మిస్టరీ థ్రిల్లర్ ‘శేష 2016’. ఇందులో సినిమా పోలీస్ వ్యవస్థలోని చీకటి కోణాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతేకాదు దీనికి రివేంజ్, కర్మ సిద్ధాంతం అనే ఎలిమెంట్స్ ను కలిపి ఆసక్తికరమైన కథగా మలిచారు. ప్రస్తుతం ఈ చిత్రం Sun NXT ఓటీటీలో అందుబాటులో ఉంది. మే 22 నుంచి డిజిటల్ ప్రీమియర్ ప్రారంభమైన ఈ మూవీని కన్నడ, మలయాళ భాషల్లో చూడవచ్చు. తెలుగులో డబ్బింగ్ లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. కానీ భాష అడ్డుకాదనుకునే వారికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉంది. సస్పెన్స్, రివేంజ్, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘శేష 2016’ మూవీ సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం పక్కా.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ మొత్తం ఒకే రాత్రిలో జరుగుతుంది. కానీ ఆ ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలు సినిమాలోని ప్రతి పాత్ర జీవితాన్ని ఊహించని విధంగా మార్చేస్తాయి. సినిమాలో కొందరు అవినీతి పోలీస్ అధికారులు చేసే పనులను కర్మ ఎలా శిక్షించిందో చూడవచ్చు. లంచాలు తీసుకోవడం, ఇల్లీగల్ సెటిల్‌మెంట్లు చేయడం, కస్టడీ హింసతో అమాయకుల జీవితాలను నాశనం చేయడం వంటి దారుణాలు చేయడమే కాకుండా, ఇలాగే తప్పించుకుంటూ హాయిగా ఉంటామనే అహంకారంతో బతుకుతారు. కానీ ఇలాంటి వారిపై ఓరోజు ఓ అపరిచిత వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవడం స్టార్ట్ చేయడంతో కథలో ట్విస్ట్ వస్తుంది.

మొదట దీన్ని సాధారణ దాడిలా కొట్టిపారేస్తారు అంతా. కానీ ప్రతి హత్య వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉందని అర్థం కావడానికి ఎక్కువ టైమ్ పట్టదు. ఇక ఈ హత్యలు పోలీస్ స్టేషన్ లోపలే జరగడం మరో ఆసక్తికర అంశం. బయట కుండపోత వర్షం పడుతుండడంతో, పోలీస్ స్టేషన్ కు నగరంతో సంబంధాలు తెగిపోవడం, ఫోన్లు పనిచేయకపోవడంతో అక్కడేం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసే ప్రసక్తే ఉండదు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న భయం క్రమంగా అనుమానంగా మారి వాళ్ళలో వాళ్ళే చివరికి ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి వస్తుంది. గతంలో వాళ్ళు చేసిన తప్పులు, అమాయకుల ప్రాణాలు పోవడం, రివేంజ్ ను ఇంటెన్స్ గా చిత్రీకరించారు. అసలు ఆ హంతకుడు ఎవరు ? అతనికి పోలీసులపై పగ ఎందుకు ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : 200000 కోట్ల ఆస్తి కోసం 7 హత్యలకు స్కెచ్… నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠ రేకెత్తించే మూవీ

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×