E-Paper
Advertisement

200000 కోట్ల ఆస్తి కోసం 7 హత్యలకు స్కెచ్… నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠ రేకెత్తించే మూవీ

200000 కోట్ల ఆస్తి కోసం 7 హత్యలకు స్కెచ్… నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠ రేకెత్తించే మూవీ
Advertisement

Comedy Thriller Movie on OTT : డార్క్ కామెడీకి థ్రిల్లర్ టచ్ కలిస్తే… నవ్విస్తూనే నెక్స్ట్ సీన్‌లో షాక్ ఇస్తే, మర్డర్‌ ను కూడా ఎంటర్టైనింగ్ గా చూపిస్తే… సినిమా చూసే ప్రేక్షకుడిని హీరో పక్షాన నిలబెట్టి అతడితోనే నేరాలు చేయించడం లాంటి డేంజరస్ మైండ్ గేమ్ ఆడే సినిమానే అసలైన బ్లాక్ కామెడీ థ్రిల్లర్. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి మూవీనే. How to Make a Killing అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ హాలీవుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసి డిజిటల్ ఆడియన్స్‌ను కూడా అలరిస్తోంది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు ? దాని కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో 

Glen Powell ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు John Patton Ford దర్శకత్వం వహించారు. 1949లో వచ్చిన బ్రిటిష్ క్లాసిక్ Kind Hearts and Coronets ప్రేరణతో రూపొందిన ఈ చిత్రాన్ని థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్. ప్రముఖ నిర్మాణ సంస్థ A24 అమెరికాలో ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 20న రిలీజ్ చేసింది. మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అంటే… 2026 మార్చి 24 నుంచి Amazon Prime Video లో రెంట్ ఆప్షన్ లో స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్‌లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 1 గంట 45 నిమిషాల రన్ టైంతో ఎక్కడా బోర్ కొట్టకుండా పరుగులు తీసే ఈ మూవీ, డార్క్ కామెడీ – క్రైమ్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

బెకెట్ రెడ్‌ఫెల్లో అనే యువకుడు మన హీరో అన్నమాట. సాధారణ మిడిల్ క్లాస్ జీవితం గడిపే అతని గతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన రెడ్‌ఫెల్లో ఫ్యామిలీకి వారసుడు. ప్రేమ వివాహం చేసుకోవడంతో అతని తల్లిని కుటుంబం అంతా వెలివేస్తుంది. ఇంకేముంది వేల కోట్ల ఆస్తి ఈ కారణంతో తల్లీకొడుకుల చేతుల్లో నుంచి అమాంతం జారిపోతుంది. అయితే తల్లి చనిపోతూ తనకు దక్కాల్సిన జీవితాన్ని కోల్పోయా అనే బాధను కొడుకు ముందు వెళ్లబుచ్చుతుంది. అదే ఆమె చేసిన తప్పు అవుతుంది.

ఈ నేపథ్యంలోనే ఓరోజు తన స్నేహితురాలు జూలియా సరదాగా అన్న మాట బెకెట్ జీవితంలో ఊహించని మలుపు అవుతుంది. మొత్తం 28 బిలియన్ డాలర్ల ఆస్తికి సంబంధించిన మాట అది. తనకంటే ముందు ఆస్తి కోసం లైన్‌లో ఉన్న బంధువులందరూ పోతే అని ఆమె చెప్పిన మాట అతని మెదడులో బలంగా నాటుకుపోతుంది. అంతే అప్పటి నుంచి తన బంధువులను ఒక్కొక్కరిగా ఎలాంటి అనుమానం రాకుండా చంపడం స్టార్ట్ చేస్తాడు. మరి పోలీసులకు దొరకకుండా హీరో ఎలా హత్యలు చేస్తున్నాడు ? మధ్యలో మొదలైన అతని లవ్ స్టోరీ ఏమైంది ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిన కథ.

Advertisement

Read Also : జియో హాట్ స్టార్ లో చూడాల్సిన బెస్ట్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా మస్త్ టైమ్ పాస్

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×