Mystery Drama OTT : సముద్రం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అలల కింద ఏముంది, లోతుల్లో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి అనే ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానాలు లేవు. అలాంటి సముద్రంలో ముప్పై ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ చేపల పడవ అకస్మాత్తుగా తిరిగి కనిపిస్తే ఎలా ఉంటుంది ? అది తిరిగి రావడమే ఆశ్చర్యం అనుకుంటే, ఆ పడవలో ప్రయాణించిన తర్వాత మనుషుల జీవితాల్లో జరిగే మార్పులు మరింత గందరగోళానికి గురిచేస్తాయి. కాలం, జ్ఞాపకాలు, వాస్తవం మధ్య సరిహద్దులను ప్రశ్నించే మిస్టరీ డ్రామా ‘రోజ్ ఆఫ్ నెవాడా’ (Rose of Nevada). మరి ఈ మిస్టరీ డ్రామా కథ ఏంటి ? స్ట్రీమింగ్ ఎక్కడ ? అనేది తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్దాం.
ముప్పై ఏళ్ల క్రితం సముద్రంలో కనిపించకుండా పోయిన పాత చేపల పడవ పేరు రోజ్ ఆఫ్ నెవాడా. అది ఎలా అదృశ్యం అయ్యిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. కాలం గడిచిపోతుంది. ఆ పడవ గురించి జ్ఞాపకాలు క్రమంగా మసకబారుతాయి. కానీ ఒకరోజు అదే పాత పడవ మళ్లీ కనిపిస్తుంది. దాన్ని చూసిన వారికి షాక్ తగులుతుంది. అంతకాలం సముద్రంలో ఏమైందో, పడవ ఎక్కడికి వెళ్లిందో, తిరిగి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది.
ఈ సమయంలో ఇద్దరు కష్టాల్లో ఉన్న అబ్బాయిలు ఆ పడవలో పని చేయడానికి ముందుకొస్తారు. ఈ ఉద్యోగం ద్వారా వాళ్లు కష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తారు. పడవలో ప్రయాణం మొదలైనప్పుడు వారి దృష్టి పని మీదే ఉంటుంది. కానీ సముద్ర ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, తాము వదిలి వెళ్లిన ప్రపంచం మునుపటిలా లేదనే భావన వారిని వెంటాడుతుంది. ఏది నిజం, ఏది తమకు గుర్తున్న గతం, ఏది మారిపోయిన వర్తమానం అనేది అస్సలు అర్థం కాదు.
మరి ఇంతకీ అన్నేళ్ళు మిస్ అయిన ఆ పడవ సడన్ గా ఎలా తిరిగి వచ్చింది ? అందులో పని చేయడానికి వెళ్ళిన ఇద్దరు అబ్బాయిలు ఏమయ్యారు ? నిజంగానే వాళ్ళ కష్టాలు తీరాయా ? అన్నది తెలియలంటే సినిమాను డోంట్ మిస్. ఇది వేగంగా సాగిపోయే థ్రిల్లర్ కాదు, స్లో బర్న్ మూవీ.
Read Also : స్టేజ్పై నవ్వులు పూయించిన ఆ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా ? ఓటీటీలోకి ఆసక్తికరమైన డాక్యుమెంటరీ
2025లో రూపొందిన బ్రిటిష్ మిస్టరీ డ్రామా ‘రోజ్ ఆఫ్ నెవాడా’ అక్టోబర్ 16 నుంచి ముబి (MUBI)లో అందుబాటులోకి రానుంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కాబట్టి సినిమాను ఇంగ్షీషులోనే చూడాల్సి ఉంటుంది. కాలం, జ్ఞాపకాలు, సముద్రపు రహస్యాల చుట్టూ తిరిగే నెమ్మదైన మిస్టరీ కథలు ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చూడవచ్చు. దర్శకుడు మార్క్ జెంకిన్ (Mark Jenkin) ఈ చిత్రాన్ని రొటీన్ మిస్టరీ కథగా కాకుండా, కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించారు. ఇందులో మిస్టరీతో పాటు ఊహాత్మక అంశాలు, భయానకమైన వాతావరణం కూడా ఉంటాయి. కథలో ప్రతి విషయానికి వెంటనే సమాధానం దొరకకపోవచ్చు. కానీ సినిమా మాత్రం పక్కా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది.