Srinivasa mangapuram ott:దివంగత సూపర్ స్టార్ కృష్ణ(Krishna )మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) కొడుకు ఘట్టమనేని జయకృష్ణ (Ghattamaneni Jayakrishna) ఎట్టకేలకు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . రవీనా టాండన్ (Raveena Tandon) కూతురు రషా తడానీ (Rasha Thadani) ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సాధారణంగా థియేటర్లలో విడుదలయ్యే ఏ సినిమా అయినా సరే ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తుందా? అని అభిమానులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఘట్టమనేని వారసుడి నుండి వస్తున్న తొలి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుందో అని ఓటీటీ లవర్స్ ఎదురు చూస్తుండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ మేరకు వచ్చే నెల ఆఖరి కల్లా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.
also read:వరుణ్ తేజ్ మంచి మనసు.. ట్యూమర్ చికిత్సకి అయ్యే పూర్తి ఖర్చు తనదే అంటూ!
ఇకపోతే మరొకవైపు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శ్రీను (జయ కృష్ణ)కు మంగ (రషా తడానీ) అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగా.. అతని నిజమైన ప్రేమను చూసి చివరికి ప్రేమలో పడుతుంది. అదే సమయంలో బళ్లారి వెంకటప్ప నాయుడు (మోహన్ బాబు) వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా?అనేదే అసలు స్టోరీ..
ఇకపోతే ఆడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. అజయ్ భూపతి అందించిన స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉందని, ట్విస్టులు లేకపోవడంతో సినిమా ఆకట్టుకోలేదని పలువురు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ కి మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. జయకృష్ణకి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. డైలాగ్ డెలివరీతో పాటు యాక్షన్ సన్నివేశాలలో మంచి ఇంటెన్సిటీ చూపించాడని.. రషా తడానీ స్క్రీన్ ప్రెజెంట్స్ కూడా ఆకట్టుకుందనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇక వీరిద్దరి జోడి తెరపై బాగున్నప్పటికీ బలహీనమైన కథనం వారి ప్రయత్నాన్ని తగ్గించిందని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది లవ్ స్టోరీ యాక్షన్ అంశాలు బాగున్నాయని, సినిమా ఎంటర్టైనింగ్గా సాగిందని పెడుతున్నారు. ఇకపోతే ఘట్టమనేని అభిమానులు, కొంతమంది నెటిజన్లు మాత్రం డెబ్యూ హీరోగా జయకృష్ణ కి మంచి మార్కులు పడతాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకుల ఆదరణ, బాక్స్ ఆఫీస్ వసూళ్లు, రాబోయే రోజుల్లో వచ్చే దానిని బట్టి క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.