E-Paper
Advertisement

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller: ఊహించండి.. బయట అడుగు పెడితే చాలు శరీరం గడ్డకట్టిపోయేంత చలి. నగరాలు కొన్ని గంటల్లోనే మంచులో కూరుకుపోతే? కరెంట్ లేకపోతే, వాహనాలు పనిచేయకపోతే, ప్రపంచంతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతే? అదే సమయంలో ప్రపంచాన్ని నాశనం చేయగల ప్రాణాంతక వైరస్‌కు మందు దొరికితే.. ఆ మందును సురక్షితంగా మరో ల్యాబ్‌కు చేర్చాల్సిన బాధ్యత కొందరిపై పడితే? ప్రకృతి ఒకవైపు, సమయం మరోవైపు వెంటాడుతుంటే వాళ్లు ఆ ప్రయాణాన్ని పూర్తి చేయగలరా? ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితులతో తెరకెక్కిన డిజాస్టర్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ ‘అపోకలిప్స్ ఆఫ్ ఐస్’ (Apocalypse of Ice).

కథలోకి వెళ్తే…

భూమిపై వాతావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతినడంతో పరిస్థితులు అదుపు తప్పుతాయి. ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో చోటుచేసుకున్న మార్పులు తీవ్రమైన మంచు తుఫానులకు దారితీస్తాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ‘పోలార్ వోర్టెక్స్’. ఈ మంచు తుఫాన్లు సాధారణ చలికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పరిస్థితులు వేగంగా దిగజారడంతో నగరాలు గంటల వ్యవధిలోనే మంచుతో కప్పబడటం మొదలవుతుంది.

Advertisement

ఉష్ణోగ్రతలు మైనస్ 100 డిగ్రీలకు పడిపోయే పరిస్థితి రావడంతో బయటకు వెళ్లడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే అవుతుంది. మనుషులు ఇంటి నుంచి బయటకు వచ్చినా క్షణాల్లోనే గడ్డకట్టే ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ జీవితం పూర్తిగా స్తంభిస్తుంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటుంది. రవాణా ఆగిపోతుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయకుండా పోతాయి. అంటే ఒక ప్రాంతంలో ఉన్న వాళ్లు మరో ప్రాంతంతో సంబంధాలు పెట్టుకోవడమే కష్టంగా మారుతుంది.

ఇదే సమయంలో ప్రపంచాన్ని మరో ప్రమాదం వెంటాడుతుంటుంది. ఇప్పటికే అనేక సమస్యలు సృష్టిస్తున్న ఒక ప్రాణాంతక వైరస్‌కు విరుగుడు కనుగొనే ప్రయత్నం అంటార్కిటికాలోని పరిశోధనా కేంద్రంలో కొనసాగుతుంది. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు చివరకు కీలకమైన విజయాన్ని సాధిస్తారు. వైరస్‌కు అవసరమైన క్యూయర్ దొరుకుతుంది. కానీ దాన్ని అక్కడే ఉంచితే ప్రయోజనం లేదు. మానవాళిని కాపాడాలంటే దాన్ని ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న మరో ల్యాబ్‌కు సురక్షితంగా చేర్చాలి.

Advertisement

అక్కడి నుంచే అసలు సర్వైవల్ జర్నీ మొదలవుతుంది. శాస్త్రవేత్తలు, సర్వైవల్ నిపుణులు కలిసి ఆ మందును తీసుకుని మంచు తుఫానులో ప్రయాణం ప్రారంభిస్తారు. కానీ వాళ్లకు ఎదురయ్యే సమస్యలు ఒక్కటే కావు. దారిలో మంచు పర్వతాలు కూలిపోవచ్చు. ఆక్సిజన్ తగ్గిపోవచ్చు. వాహనాల్లోని ఇంధనం గడ్డకట్టిపోవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతికేలోపే మరో ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.

ఈ ప్రయాణంలో సమయం అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది. ఒకవైపు ప్రకృతి మొత్తం మనుషులపై తిరుగుబాటు చేసినట్టుగా ఉంటుంది. మరోవైపు వైరస్‌ను అడ్డుకోవడానికి అవసరమైన క్యూయర్ సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలి. ఈ ప్రయాణం మధ్యలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి కథలో టెన్షన్‌ను పెంచుతుంది. చివరకు ఆ క్యూయర్ ల్యాబ్‌కు చేరుతుందా? ప్రపంచాన్ని కాపాడే అవకాశం మానవాళికి దక్కుతుందా? అనేది సినిమా ఉత్కంఠ.

OTTలో ఎక్కడ చూడాలి?

‘అపోకలిప్స్ ఆఫ్ ఐస్’ (Apocalypse of Ice) ప్రస్తుతం హాట్‌స్టార్ (Hotstar)లో తెలుగు ఆడియో డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ప్రకృతి విపత్తులు, ఎక్స్‌ట్రీమ్ వెదర్, సర్వైవల్ మిషన్లు, ప్రపంచాన్ని కాపాడే రేస్ తరహా కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

Read Also: ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

Tags

Related News

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

ఇరుముడి నుంచి లస్ట్ ​స్టోరీస్ వరకు… ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 క్రేజీ ప్రాజెక్ట్‌లు

కాశీ యాత్ర నేపథ్యంలో సాగే వినోదాత్మక ప్రయాణం… నవ్వులు పూయించే తెలుగు క్లాసిక్ కామెడీ డ్రామా

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

Big Stories

Advertisement
×